టీడీపీ..బీజేపీల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవటం స్థానే ఇప్పుడు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేతను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా.. ఆయన కుమారుడు లోకేశ్ మీదా కొత్త తరహా ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు బాబు.. చినబాబులకు చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా జీవీఎల్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వద్దకు లోకేశ్ ఒక బ్రోకర్ ను పంపాడంటూ సంచలన ఆరోపణ చేశారు. దీనిపై తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకొని లోకేశ్ సవాలు విసిరారు.
జీవీఎల్ కు దమ్ముంటే.. తనపై చేసిన ఆరోపణను నిరూపించాలన్నారు. కేంద్రమంత్రి వద్దకు బ్రోకర్ ను పంపానంటున్న ఆయన... తాను ఏ కేంద్రమంత్రి వద్దకు బ్రోకర్ ను పంపానో చెప్పాలంటూ మండిపడుతున్నారు. కేంద్రమంత్రి పేరు.. బ్రోకర్ పేరును బయటపెట్టాలన్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్మించేలా జీవీఎల్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఢిల్లీలో లాబీయింగ్ అంటూ కొత్త కథను మొదలు పెట్టారంటున్న లోకేశ్ మరీ అంత ఆగ్రహం చెందాల్సిన అవసరం లేదేమో? ఎందుకంటే.. ఇప్పటివరకూ ఏపీ విపక్ష నేత మీద ఏ రీతిలో అయితే.. అదే పనిగా బండలు వేస్తున్నారో.. ఇప్పుడు వారి బాటలో నడుస్తున్న బీజేపీ తెలుగు తమ్ముళ్లపై బండలు వేస్తుందని చెప్పాలి. ఆ మాత్రం బండలకే అంతలా ఆగమాగం అయిపోతే ఎలా చినబాబు? మరో మాట.. సవాల్ విసిరేటప్పుడు మీరు కానీ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. రాజకీయాల నుంచి శాశ్వితంగా వైదొలుగుతా.. లాంటివి చేయాలి కదా? అదేమీ లేకుండా ఉత్తుగా ట్వీట్ సవాల్ చేస్తే ఎలా..?