ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలపై బాబు చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన స్పందించారు. 2018లో ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తున్నాయని ఇటీల సీఎం చంద్రబాబు అన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2018లో ఏ రాష్ట్రానికి ఎన్నికలు లేవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ...ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని లోకేష్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే చంద్రబాబు చెప్పారని లోకేష్ తెలిపారు.
ఏడాది ముందు ఎన్నికలంటే ఎవరు ఒప్పుకుంటారని, ఆరు నెలల ముందు అనేది సమంజసంగా ఉంటుందని లోకేష్ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని ఉత్సాహాన్ని చూపుతున్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని లోకేష్ చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రాన్ని సీఎం ఎంతో అభివృద్ధి చేశారని.. టీడీపీ గెలుపు ఖాయమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/