చినబాబు లోకేష్ ఫైర్ బ్రాండ్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితం మీద దారుణంగా విమర్శలు చేస్తున్నారని, అలాగే తన తల్లి మీద కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా అనుచితమైన కామెంట్స్ చేశారని ఆయన మండిపడ్డారు.
విశాఖ టూర్ లో ఆయన వైసీపీ సర్కార్ మీద ఒక లెవెల్ లో దండెత్తారు. తాను తమ పార్టీ వారు సహనంతో ఉన్నామని, దాన్ని చూసి వైసీపీ నేతలు లేని పోని బండలు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
తన తల్లిని పవిత్రమైన అసెంబ్లీలో దూషించిన వారు క్షమాపణలు చెప్పేదాకా వెంటాడుతామని అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
అలాగే, 2024 ఎన్నికల తరువాత వచ్చేది తామేనని, అపుడు అంతా చూస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.తాను కూడా నోరుందని జగన్ మీద, ఆయన తల్లి విజయలక్ష్మి, భార్య భారతీరెడ్డి, ఇద్దరు కుమార్తెల మీద విమర్శలు చేస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీకి అలాంటి కల్చర్ లేదని చెప్పుకున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో అన్నీ రకాలైన ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు వాకట్టు అయిపోతున్నాయని లోకేష్ సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వం ఒక వైపు చెత్తను కూడా వదలకుండా పన్నుల మీద పన్నులు వేస్తోంది. ఇంకో వైపు ఉన్న ఆస్తులు తాకట్టుపెడుతోందని విమర్శించారు. విశాఖలోని స్టేడియంని కూడా తాకట్టులో పెడుతున్నారని, ఇక రాబోయే రోజుల్లో తాము నిలుచున్న రోడ్డునీ, ఆఖరుకు చెట్టుకుని కూడా తాకట్టు పెట్టగల సమర్ధులు అంటూ పంచులు పేల్చారు.
వైసీపీ సర్కార్ పెద్దలకు ఇలా ఎంత డబ్బు తెచ్చినా సరిపోవడంలేదు అంటే దారుణంగా అక్కడ దుబారా జరుగుతోంది అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అన్న వారు ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలి కానీ ఉన్న వాటిని తాకట్టు పెట్టడమేంటి అని జగన్ మీద లోకేష్ ఫైర్ అయ్యారు. మొత్తానికి లోకేష్ యాంగ్రీ యంగ్ మాన్ గా విశాఖ టూర్ లో వైసీపీ మీద నిప్పులే చెరిగారు. క్యాడర్ మొత్తానికి కొత్త జోష్ తెచ్చారు.