లోకేశ్ మాట నిజ‌మేనా ప‌వ‌న్?

Update: 2017-08-03 04:42 GMT
ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు.. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ.. జ‌న‌సేన‌ల‌తో క‌లిసే జ‌నంలోకి వెళ్ల‌నున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌నీ ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు.

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి 100 రోజులు పూర్తి అయిన నేప‌థ్యంలో ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో లోకేశ్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత త‌న‌కు తానుగా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పార‌ని.. అంత మాత్రాన బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు క‌లిసిన‌ట్లు కాద‌న్నారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎన్నికైన త‌ర్వాత మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌దామ‌ని అనుకున్నాన‌ని.. కానీ ముందుగానే ఎమ్మెల్సీగా మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌న్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌లం ఎక్కువ‌గా కనిపిస్తుందంటూ వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌న్నారు.

ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే తెలుగుదేశం పార్టీ 140 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పిన లోకేశ్‌.. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ.. జ‌న‌సేన‌ల‌తో క‌లిసి పోటీ చేయ‌టం ఖాయ‌మ‌న్న మాటను ప‌వ‌న్ క‌ల్యాణ్ విన్నారా? అన్న‌ది ఇప్ప‌డు సందేహంగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన వేళ‌.. అందుకు భిన్నంగా లోకేశ్ మాత్రం క‌లిసి పోటీ చేయ‌టం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించ‌టం ఖాయం.

మ‌రి.. క‌లిసి పోటీ చేస్తామ‌ని చెప్పే లోకేశ్ మాట‌ను న‌మ్మాలా? అన్న విష‌యంపై జ‌న‌సేనాధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల పొత్తు అంశంపై లోకేశ్ ఎప్ప‌టి మాదిరి తొంద‌రప‌డి మాట్లాడారా? అన్న‌ది సందేహంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News