రేవంత్ - నరేంద్రకు నోటీసులు..టెన్షన్ లో లోకేష్!

Update: 2019-02-13 08:51 GMT
ఓటుకు నోటు కేసు తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్  ఓటును కొనబోయి తెలుగుదేశం పార్టీ చిక్కుకున్న సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండిన రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో సంప్రదింపులు జరిపాడు. అందుకు సంబంధించి వీడియోలు బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ సంభాషణతో ఇరుక్కున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఆ కేసు వెన్నాడుతూ ఉంది. ఆ కేసు దెబ్బకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను ఖాళీ చేసేశాడనే అభిప్రాయాలున్నాయి.

ఇక తెలంగాణలో తెలుగుదేశం అంతా చిత్తు కావడానికి కారణం కూడా ఓటుకు నోటు కేసే కారణం. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు నోటు కేసు లో మళ్లీ కదలికలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ కేసులో ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని విచారించింది. అతి త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇవి తెలుగుదేశం పార్టీ నేత - మంత్రి లోకేష్ బాబును కూడా టెన్షన్ పెడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఇవ్వజూపిన ఐదు కోట్ల రూపాయల డబ్బు మూలాలు ఎక్కడెక్కడో ఉన్నాయని.. వాటి జాడను ఈడీ ఇప్పటికే పసిగట్టిందని.. జరగబోయే విచారణలతో మరిన్ని వ్యవహారాలు బయటకు రాబోతున్నాయని.. ఈ పరిణామాలు లోకేష్ ను బాగా ఆందోళనకు గురి చేస్తున్నాయనే సమాచారం అందుతోంది. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరి కూసాలు కదులుతాయో!
Tags:    

Similar News