ఎవరికో పుట్టిన బిడ్డకు నువ్వు తండ్రివా: జగన్‌పై నారా లోకేష్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగా రు. సీఎం జగన్ రెడ్డిది సిగ్గు లేని జన్మ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ జగన్ రెడ్డి తెచ్చింది కాదన్నారు.
ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 'ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడ'ని నారా లోకేష్ ట్వీట్‌లో విమర్శించారు.
ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ కంపెనీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయి తే.. ఇది గత చంద్రబాబు హయాంలోనే ఎంవోయూ చేసుకుంది. తీరా ఒప్పందం అమల్లోకి వచ్చే సరికి టీడీపీ ప్రభుత్వం పడిపోయి.. వైసీపీ సర్కారు వచ్చింది.
తర్వాత కూడా కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. ఎట్టకేలకు తాజాగా.. ఇది పట్టాలకెక్కింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద.. టీసీఎల్ నిర్మించే ఐటీ హబ్‌కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నేపథ్యంలో అన్నిపేపర్లు, మీడియాకు భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం ఇవన్నీ కూడా సీఎం జగన్ ఘనతేనని పేర్కొంది. జగన్ కృషితోనే ఇవన్నీ ఏపీకి వచ్చాయని.. ప్రబుత్వం వివరించింది. దీంతో ఈ ప్రకటన రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలోనే టీడీపీ నాయకుడు నారా లోకష్ రియాక్ట్ అయ్యారు.
అయితే.. లోకేష్ తీవ్రంగా స్పందించడం.. ఎవరికో పుట్టిన బిడ్డకు నువ్వు తండ్రివా? అని ప్రశ్నించడం వంటివి.. ఒకింత ఎబ్బెట్టుగా ఉన్నాయని.. ఆయన రాజకీయ సీనియార్టీకి, వయసుకు కూడా తగవని.. అంటున్నారు. రాజకీయాల్లో హుందా తన పోతే.. ప్రజలు కూడా పక్కన పెట్టేస్తారని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ట్వీట్ టీడీపీ వర్గాల్లో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.