ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో అసలుసిసలు సినిమా ఉంటుందని చెప్పిన ఆయన.. తన కలను ఆవిష్కరించారు. భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందన్న ఆయన.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.
ఈ సందర్భంగా విపక్ష నేత వైఎస్ జగన్ మీదా.. ఒకప్పటి తమ మిత్రుడు.. ప్రస్తుతం ప్రత్యర్థి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ది పుత్రుడు చంద్రబాబు అయితే.. అవినీతి పుత్రుడు జగన్ అని.. ప్రధాని మోడీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
ప్రత్యేకహోదా.. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం వెన్నుపోటు పొడిస్తే జగన్.. పవన్ లు ప్రధాని మోడీని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదన్నారు. 68 ఏళ్ల వయసులో రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు పని చేస్తున్నారని.. అలాంటి నాయకుడిపైన జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం సబబా? అంటూ ప్రశ్నించారు. గుంటూరు సభలో తనపై వ్యక్తిగత విమర్శలు.. ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ వాటిని నిరూపించాలన్న లోకేశ్.. పవన్ కల్యాణ్ కు దమ్ము ధైర్యంఉంటే నాపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలి.. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన సవాల్‌కు పవన్ స్పందించాలన్నారు.
తన కర్నూలు పర్యటన సందర్భంగా తడబాటు.. త్రోటుపాటుకు గురైన లోకేశ్..రెండో రోజు తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు. అయితే.. 2019లో అసలు సినిమా అంటూ చెప్పిన లోకేశ్ మాటలపై వ్యంగ్యస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ ఇప్పటికైనా నిజమే చెప్పారని.. 2019లో చంద్రబాబు అండ్ కో కు నిజమైన సినిమా తప్పదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బాబు పాలనపై విసిగిపోయిన ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పుతో పాటు.. కొత్త రాజధాని పేరుతో బాబు చేసిన భూభాగోతాలన్నీ 2019లో బయటకు రావటం ఖాయమంటున్నారు. ప్రజల ఆశీస్సులతో జగన్ సీఎం అవుతారని.. అప్పుడు బాబు బ్యాచ్ చేసిన భాగోతాలన్ని బయటకు తీసి.. చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయన్న మాటను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ ముహుర్తాన లోకేశ్ అన్నారోకానీ.. 2019లో అసలు సినిమా అని.. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్నదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.