నేతలు తమ మాటలతో రాజకీయ ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా మాట్లాడతారు. ఆత్మరక్షణలో పడేలా వాదన వినిపిస్తారు. ఇలాంటివన్నీ రాజకీయ నేతలకు సహజసిద్ధంగా ఉండే లక్షణాలు. కానీ.. చినబాబు లోకేశ్ మాత్రం వీటికి కాస్త మినహాయింపు. జనరంజకంగా మాట్లాడటంలో వెనుక వరుసలో ఉండే తన తండ్రి చంద్రబాబు పోలికలు లోకేశ్ కు ఎక్కువే.
బాబు ప్రసంగమే బోరింగ్ ఉందనుకుంటే.. లోకేశ్ ప్రసంగం మరీనూ. మైకు పుచ్చుకొని మాట్లాడితే మనసు దోచుకోని లోకేశ్ లో మరో ఆసక్తికర కోణం ఉంది. ఆయన సామాజిక మాథ్యమం ట్విట్టర్ ను వేదికగా చేసుకొని ట్వీట్స్ తో పొలిటికల్ పంచ్ లు విసురుతుంటారు. రెగ్యులర్ గా కాకున్నా.. అవసరానికి తగినట్లుగా ఉండే ఆయన ట్వీట్స్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకొని ట్వీట్స్ చేశారు.
జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రను చేపట్టటంపై చినబాబు లోకేశ్ స్పందిస్తూ.. రాజకీయ యాత్రలతో రైతులకు నీళ్లు అందిస్తారా? అంటూ ప్రశ్నించిన ఆయన.. జగన్ కానీ రైతుల మేలు కోరేవాళ్లే అయితే పట్టిసీమ ప్రాజెక్టుకు ఎందుకు మద్ధతు ఇవ్వరంటూ సూటిగా ప్రశ్నించారు. పంచ్ పడేలా మాట్లాడుకున్నా.. ట్విట్టర్ ట్వీట్స్ లో అయినా పదును ప్రదర్శిస్తున్నందుకు తెలుగు తమ్ముళ్లు చినబాబును చూసి సంతోషపడాలేమో.