తెలంగాణలో ఆల్ మోస్ట్ డిజాస్టర్ షోలు వరుసగా వేస్తోన్న టీడీపీని బలోపేతం చేసేందుకు లోకేష్ చికిత్స స్టార్ట్ చేశాడు. ప్రతి శనివారం లోకేష్ టీడీపీ ముఖ్యనాయకులతో మీట్ అవుతూ తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నారు. ఇక ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు - ఏకైక ఎంపీ కూడా పార్టీ వీడిపోవడంతో మిగిలిన నాయకులు కూడా పదవుల కోసం పట్టుబడుతున్నారు. తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ పదవులు - తమ వర్గానికి పలానా పోస్టు కావాలని డిమాండ్లు చేస్తోన్న నాయకులకు లోకేష్ స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశం ప్రారంభంలోనే కొందరు సీనియర్లు తమ వర్గానికి పలానా పోస్టులు కావాలని ప్రస్తావించడంతో వారిపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారట. అసలు పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే అంశంపై చర్చే స్టార్ట్ కాకుండానే ఈ డిమాండ్లు ఏంటని లోకేష్ ఫైర్ అయినట్టు సమాచారం. ఎవరికి వారు డిమాండ్లతో ముందుకు వస్తే ఎలా..? మీకు వ్యక్తిగత ఎజెండాలు - ప్రతిపాదనలు ఉంటే తనతో పర్సనల్‌గా చర్చించాలే తప్ప ఇలా పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేసిన సమావేశంలో ఓపెన్‌గా చెపితే ఎలా అని ఒకింత కటువుగానే ప్రశ్నించారట.
తెలంగాణలో ఉన్న కొద్ది పాటి సీనియర్ నాయకులు కూడా ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం - ఫిర్యాదులు చేసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప పార్టీ బలోపేతానికి కృషి చేయడం, కలిసి కట్టుగా పని చేయాలన్న ఆలోచనే వారికి లేదని లోకేష్ డిసైడ్ అయినట్టు టాక్? పార్టీకి నష్టం కలిగించే వారి విషయంలో మొహమాటంతో ఉంటే పార్టీ మరింత నష్టపోతుందని..ఇకపై వారి విషయంలో ఉపేక్షించేది లేదని లోకేష్ ఈ సమావేశంలో కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీ తెలంగాణ నేతలకు లోకేష్ ఇచ్చిన వార్నింగ్ పార్టీని గాడిలో పెడుతుందా ? తెలంగాణలో టీడీపీకి లోకేష్ చికిత్స - సలహాలు - సూచనలు ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి.