జగన్ సరిగా నెలన్నర రోజులైనా పాలన పూర్తి చేయకముందే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం అతిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంశాల వారీగా కాకుండా.. ఏకంగా పెద్ద పెద్దగా మాట్లాడేస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు - లోకేష్ లు మాట్లాడుతున్న మాటలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి.
చంద్రబాబు నాయుడేమో ఏపీకి జగన్ పెట్టుబడులు తీసుకురావడం లేదని అనేస్తున్నారు! చంద్రబాబు నాయుడు హయాంలో మొన్నటి వరకూ నడిచిన పెట్టుబడుల డ్రామాలు ప్రజలు మరిచిపోలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు పెట్టుబడులు గురించి మాట్లాడేస్తూ ఉన్నారు!
ఇక లోకేష్ అయితే మరింత బరువైన పదాలు వాడేస్తూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో ఐటీ పడిపోతోందని లోకేష్ వ్యాఖ్యానించడం ప్రహసనంగా మారింది. ఏపీలో ఉన్న ఐటీ ఏ పాటిదో చెప్పి - నెల రోజుల్లో పడిపోయినదెంతో లోకేష్ చెప్పి ఉండాల్సింది!
ఇక ట్విటర్ వేదికగా స్పందించడం మాత్రమే చేస్తున్న లోకేష్.. అక్కడ పెద్దపెద్ద మాటలు ఉపయోగించేస్తూ ఉన్నారు. ఏపీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండ చేస్తోందని లోకేష్ అంటున్నారు. కర్నూలు జిల్లాలో మెగా సోలార్ ప్రాజెక్టులోకి చొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అక్కడ సోలార్ ప్యానల్స్ పగలగొట్టారని లోకేష్ ఆరోపించారు. అయితే వారు పగలగొట్టింది సోలార్ ప్యానల్స్ కాదని - ఏపీ యువత భవిష్యత్ అని లోకేష్ తేల్చారు. మొత్తానికి లోకేష్ చిన్న చిన్న ఆరోపణలు చేస్తే చాలా తీవ్రంగా రియాక్ట్ అయిపోతున్నారు. అది కూడా ట్విటర్లో మాత్రమే!