24 గంట‌లు క‌రెంట్..సీరియ‌ల్స్ చూడండి:లోకేష్‌

Update: 2018-06-20 10:42 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబు సుపుత్రుడు - మంత్రి లోకేష్ బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. గ‌త నాలుగేళ్ల కాలంలో లోకేష్ త‌న ప్ర‌సంగాల వెల్లువ‌తో ప‌లుమార్లు ఏపీ ప్ర‌జ‌ల‌క వీనుల విందైన వినోదాన్ని పంచారు. జ‌యంతికి వ‌ర్థంతికి తేడా తెలియ‌క‌పోవ‌డం ద‌గ్గ‌ర నుంచి మొద‌లుపెడితే......దేశంలో అత్యంత అవినీతి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించడం వ‌ర‌కు చిన‌బాబు నోటినుంచి అనేక ఆణిముత్యాలు జాలువారాయి. చిన‌బాబు వాగ్ధాటిని భ‌రించ‌లేక‌పోయిన పెద‌బాబు...ఏకంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌సంగ‌ - వ్యాక‌ర‌ణ‌ `శిక్ష‌`కుడిని నియ‌మించారు. అయిన‌ప్ప‌టికీ లోకేష్ బాబు తీరు మాత్రం....ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. తాజాగా - చీరాల‌లో ప‌ర్య‌టించిన చిన‌బాబు....త‌న అసంద‌ర్భ ప్రేలాప‌న‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌జ‌లంద‌రికీ టీడీపీ స‌ర్కార్ 24 గంట‌ల‌పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని....దానిని మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకొని సీరియ‌ల్స్ చూస్తూ ఆనందంగా ఉండాల‌ని హాస్యాస్ప‌ద‌మైన వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి అభాసుపాల‌య్యారు. ప్ర‌స్తుతం లోకేష్ బాబు సీరియ‌ళ్ల‌పై సీరియ‌స్ గా చేసిన సిల్లీ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా....అన్న చందంగా ఉంది టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు ...ఆయ‌న సుపుత్రుడు లోకేష్ బాబుల వ్య‌వ‌హార శైలి. వ‌య‌సు మీద‌ప‌డ‌డ‌మో....రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యమో తెలియ‌దు కానీ....తాజాగా క్షుర‌కుల‌పై చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరుపై సొంత పార్టీ నేత‌లు సైతం విస్తుపోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఆ త‌ర‌హా సీరియ‌స్ వ్యాఖ్య‌ల‌ను ఏపీ ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ త‌న సిల్లీ వ్యాఖ్య‌ల‌తో...ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచారు. మొదటిసారి చీరాల‌లో ప‌ర్య‌టించిన లోకేష్ బాబు...య‌థా ప్ర‌కారం ఆచ‌ర‌ణ సాధ్యం కాని అనేక హామీలను ఇబ్బ‌డిముబ్బ‌డిగా గుప్పించారు. రామాపురంలో జరిగిన బ‌హిరంగ‌సభలో లోకేష్ బాబు త‌న వాగ్ధాటిని మ‌రోసారి నిరూపించుకున్నారు. టీడీపీ హ‌యాంలో 24 గంట‌లు కరెంట్‌ ఇస్తున్నామని, కాబ‌ట్టి మ‌హిళ‌లంద‌రూ సీరియల్స్‌ చూసి ఆనందంగా ఉండాల‌ని హాస్యాస్ప‌ద‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఆయింట్ మెంట్ రాశారు. లోకేష్ బాబు `సీరియ‌ల్ `వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

మ‌రోవైపు, కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ను లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ భావించారు. అయితే, హైస్కూల్‌ నిర్మించిన స్థలం వివాదం కోర్టులో ఉండ‌డంతో ప్రారంభించ‌డం స‌రికాద‌ని....లోకేష్ ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండానే వెనుదిరిగారు. వివాదాస్ప‌ద స్థలంలో రూ.2.20 కోట్ల అంచనాలతో నూతన భవనాలను నిర్మించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అదీగాకా సాక్ష్యాత్తూ మంత్రి లోకేష్ ప్రారంభోత్స‌వానికి రావ‌డం ఏమిటిని బాధితులు వాపోయారు. లోకేష్ తో స్కూల్ ప్రారంభం...ఆపై విద్యార్థులు - తల్లిదండ్రులతో ముఖాముఖి అని చెప్ప‌డంతో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు లోకేష్ చెప్పాపెట్ట‌కుండా వెనుదిర‌గ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురయ్యారు.
Tags:    

Similar News