టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు - ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఓటమి భారం నిజంగానే గుల్ల చేసిందని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు అస్సలు బయటకే రాని లోకేశ్... ఇక ఎంతకాలం లోపలే ఉండిపోతామనుకున్నారో - ఏమో తెలియదు గానీ... ఎట్టకేలకు బయటకు వచ్చేశారు. వచ్చీ రాగానే... ఓటమి ఇచ్చిన వైరాగ్యం తన మోములో కనిపించకుండా ఉండేందు కోసం ఆయన కొత్త వ్యూహాన్ని అమలు చేశారని చెప్పాలి. తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయినా... ఎమ్మెల్సీగా ఉన్న ఆయన నేటి ఉదయం అసెంబ్లీకి వచ్చారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన లోకేశ్... తనలోని కొత్త యాంగిల్ ను చూపించారు. అసెంబ్లీ ఆవరణలోని లాబీల్లో గతంలో లోకేశ్ ఎప్పుడూ కనిపించిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే అందుకు విరుద్దంగా లాబీలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్... అక్కడ సరికొత్తగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వైసీపీకి చెందిన మంత్రులు - ఎమ్మెల్యేలతో ఆయన కరచాలనం చేశారు. అంతేనా వారిని ఆత్మీయంగా పలకరించారు.
కడప అసెంబ్లీ నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా - విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన లోకేశ్... అక్కడే కనిపించిన వైసీపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిని కూడా ఆత్మీయంగా పలకరించారు. ఇక నిత్యం తనను - తన తండ్రి నారా చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కనిపిస్తే... ఆయనకు నమస్కారం పెట్టడంతో పాటు బాగున్నారా? అంటూ పలకరించిన లోకేశ్... నిజంగానే ఆసక్తి రేకెత్తించారు. మొత్తంగా నేటి ఉదయం నారా లోకేశ్ తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశారని చెప్పాలి.