2002లో వచ్చిన గాసిప్ అది.. నాడు జూనియర్ ఎన్టీఆర్ 2001లో ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో సినిమాల్లో హీరోగా అడుగుపెట్టాడు. అది జరిగిన ఏడాదికి లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడని ఆ సమయంలో ప్రచారం జరిగింది... అప్పుడు సీఎం చంద్రబాబే కావడంతో ఈ మేరకు చురుకుగా ప్రయత్నాలు జరిగాయని ఓ టాక్ నాడు సినీ ఇండస్ట్రీలో వచ్చింది. కానీ ఎందుకో అది ఫలవంతం కాలేదని 2002లోనే సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త చక్కర్లు కొట్టింది. మళ్లీ ఇన్నేళ్లకు అదే టాపిక్ ఓ సినీ నిర్మాత ట్వీట్ కారణంగా మళ్లీ తెరపైకి వచ్చి వైరల్ అది..
నాడు ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్ లో ఉన్న తేజ దర్శకత్వంలో నారా లోకేష్ హీరోగా ఓ సినిమా కూడా ప్లాన్ చేశారని.. అది పట్టాలు ఎక్కలేదని నాడు ప్రచారం జరిగింది. ఈ మేరకు 2002లో లాంచ్ అయిన ‘సంతోషం’ సినీ వార పత్రికలో ఓ గాసిప్ వార్త ప్రచురితమైంది.. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నారా ఫ్యామిలీ నుంచి హీరోగా నారా లోకేష్ సినిమా హీరో అవుదామని అనుకుంటున్నాడని రాసుకొచ్చారు. తేజతో కలిసి లోకేష్ హీరోగా ఇండస్ట్రీలో మూవీ తీద్దామని అనుకున్నారట.. కానీ ఎందుకో అది అప్పుడు సాధ్యపడలేదు. లోకేష్ హీరో కాలేకపోయాడు. కారణం ఏంటన్నది ఎవరికి తెలియదు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటపడిందంటే.. 2002 నాటి ‘సంతోషం’ సినీ వారపత్రికను తాజాగా దాని అధినేత , సినీ నిర్మాత సురేష్ కొండేటి పంచుకున్నారు. ఆ తొలి సంచిక కవర్ పేజీ మీద ‘ముఖ్యమంత్రి తనయుడు హీరోగా ‘తేజ’ చిత్రం’ అనే శీర్షికతో ఆ ఫొటోలను ప్రచురించారు. ఈ ఫొటోలను సురేష్ కొండేటి ట్వీట్ చేయడంతో విషయం వైరల్ అయయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తోంది. అబ్బా మన చినబాబు నిజంగా యాక్టర్ అయ్యింటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లా ఇండస్ట్రీని ఏలేవాడని.. దున్నేసేవాడని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయ్యాడని అనుకుంటున్నారట.. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ఫొటోను తీసుకొని తెగ వైరల్ చేస్తూ లోకేష్ హీరో అంటూ ‘ట్రోల్ ’ చేస్తున్నారు. టాలీవుడ్ ఒక గొప్ప హీరోను కోల్పోయిందని.. జూనియర్ ఎన్టీఆర్ తోపాటు లాంచ్ అయితే నారా లోకేష్ బాబు ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయేవాడేని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయ్యి లోకేష్ దెబ్బతిన్నాడని అనుకుంటున్నారు. తనకు సూటు కానీ రాజకీయంలో కంటే నాడు సినిమాల్లోకి వెళితే ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేసేవాడంటూ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. లోకేష్ బాబు హీరో అవ్వడం తృటిలో మిస్ అయ్యిందన్న వార్త తెలిసి ఇప్పుడు వైరల్ అయ్యింది.