తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన కృష్ణమ్మ పేరుతో కృష్ణా పుష్కరాలకు సంబంధించిన యాప్‌ను విష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను, అటు కాంగ్రెస్‌ను మరోవైపు కాంట్రాక్టర్లను ఏకకాలంలో దునుమాడేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి యువతను పక్కదారి పట్టిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చినంతనే ఉపాధి అవకాశాలు రావని లోకేష్ చెప్పారు. హోదా వచ్చి ఇంట్లో నిద్రపోతే ఉద్యోగం వస్తుందా? అని జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 30సార్లు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని, ఇప్పటివరకు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం వేరెవ్వరూ లేరన్నారు. కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే ప్రత్యేక హోదా రాదు. మైత్రి కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ సాధిస్తాం. అలాగని ప్రత్యేక హోదాను మేం వ్యతిరేకిస్తున్నట్లు కాదు’.. అని లోకేష్ తదుపరి అంచనాలకు అవకాశం లేకుండా క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటులో తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. హోదా సందర్భంగా చర్చ జరుగుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు టీ తాగేందుకు వెళ్లడం ఏపాటి చిత్తశుద్ధికి నిదర్శనమో తేల్చాలని లోకేష్ డిమాండ్ చేశారు. తమ పార్టీ కేంద్రంతో పొత్తు వదులుకుంటే మధ్యలో దూరేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
దేశంలో ఏ రాష్టమ్రూ చేయనివిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తోందని నారా లోకేష్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కృష్ణా ఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కృష్ణమ్మ యాప్ ద్వారా పొందుపర్చామని తెలిపారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో కృష్ణా పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. తెలుగుయువత, విద్యార్థి సంఘాలు కలసికట్టుగా కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు లోకేష్ చెప్పారు. ఇప్పటివరకు కృష్ణా పుష్కర పనులు 95 శాతం పూర్తవగా ఇంకా కేవలం 5 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.తప్పులు చేసిన, అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై కేసులు పెడతామని లోకేష్ హెచ్చరించారు.