జ‌గ‌న‌న్నా.. అన్న‌గారిపై కోపం పోలేదా?: నారా లోకేష్ లేఖ‌

Update: 2022-06-25 17:30 GMT
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సంచ‌ల‌న లేఖ రాశారు. పేదలు, కార్మికుల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేద‌ల‌పై కోప‌మో..అన్న‌గారి పేరుమీద ద్వేష‌మో..ఆక‌లి జీవులంటే అస‌హ్య‌మో తెలియ‌దు కానీ అన్న క్యాంటీన్లను మూసేశారు.

రాష్ట్రంలో4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లకి రంగులు మార్చి తాళాలు వేయ‌డంతో పేద‌లు, కూలీలు, అభాగ్యులు ఆక‌లితో అలమటిస్తున్నారు.`` అని పేర్కొన్నారు.

పట్టణాలకు  ప‌నుల మీద వ‌చ్చేవారంద‌రికీ రూ.5కే చక్కని భోజనం, అల్పాహారం అందించాలని .. అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారని తెలిపారు. రుచిగా..శుచిగా ఆహారం అందించే బాధ్య‌త‌ను హరేకృష్ణా అనే సేవా సంస్థకు అప్ప‌గించిన విష‌యం మీకు తెలిసిందేన‌ని అన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించామ‌ని తెలిపారు. మీరు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారు.. అని వివ‌రించారు.

``అన్న క్యాంటీన్ల‌ను మూసేసే కుట్ర జ‌రుగుతోంద‌ని మేము అడిగితే, లేద‌ని స‌మాధానం ఇచ్చిన మీ ప్ర‌భుత్వం.. ఆ త‌రువాతి రోజే వాటిని మూసేసింది. దీంతో నిరుప‌యోగంగా ఉన్న అన్న క్యాంటీన్లు అసాంఘిక కార్య‌కలాపాల‌కు అడ్డాగా మారాయి. మ‌రికొన్నింటిని వార్డు స‌చివాల‌యాలుగా వాడుతున్నారు. కొన్నింటిని జేసీబీల‌తో కూల‌గొట్టారు. మీ రివర్స్ పరిపాలన కారణంగా గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల సంఖ్య రెండింతలు పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.’’ అని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

మీరు పెట్ట‌రు.. మ‌మ్మ‌ల్ని పెట్ట‌నివ్వ‌రు!

ఆక‌లిగొన్న‌వారికి కొన్నిచోట్లయినా కొంత‌మందికైనా ఆక‌లి తీర్చాల‌ని టిడిపి ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛందంగా రాష్ట్ర‌వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల‌ను న‌డుపుతున్నామ‌ని లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు. గుంటూరు, మంగ‌ళ‌గిరి, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, బొబ్బిలి, పాల‌కొల్లు వంటి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో టిడిపి నేత‌లు, దాత‌ల‌తో క‌లిసి అన్న క్యాంటీన్ల‌ను నిర్వ‌హిస్తుంటే, ఆక‌లితో వ‌స్తున్న జ‌నం చూస్తుంటే.. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్న  క్యాంటీన్ల అవ‌స‌రం ఏ స్థాయిలో వుందో స్ప‌ష్టం అవుతోందన్నారు.  ``మీరు పెట్టరు, పెట్టేవాళ్లని అడ్డుకుంటారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే ధోరణి మంచిది కాదు`` అని హితవు ప‌లికారు.

``మేము పెడుతున్న అన్న  క్యాంటిన్లు కూల్చడం, అడ్డుకోవడం లాంటి పనులు ఇకనైనా ఆపాలని కోరుతున్నాను. నిధులు లేవు, అప్పులు దొర‌క‌డంలేద‌ని మాత్రం సాకులు వెత‌క‌కుండా, ఆక‌లి తీర్చే అన్న  క్యాంటీన్ల బ‌డ్జెట్ మీరు మీ మాన‌స‌పుత్రిక సాక్షికి ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు బ‌డ్జెట్ కంటే త‌క్కువే. కొన్నాళ్లు మీ సొంత మీడియాకి యాడ్స్ ఇవ్వ‌డం ఆపేస్తే రాష్ట్రంలోని అన్ని పట్ట‌ణాల‌లో అన్న  క్యాంటీన్ల‌ను తెరిచి నిర్వ‌హించ‌వ‌చ్చు`` అని పేర్కొన్నారు.
Tags:    

Similar News