చినబాబు ఎమ్మెల్సీ పదవిపై ఏకగ్రీవం..

Update: 2017-02-26 11:00 GMT
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఆ కీలక నిర్ణయాలకు నేతలతో జై కొట్టించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారని కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయి. కొద్ది సేపటి కిందట చంద్రబాబు నివాసంలో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తనయుడు లోకేశ్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అదే సమయంలో మిగతా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో చంద్రబాబుకే అప్పగించింది.
    
మరోవైపు రాష్ట్ర విభ‌జ‌న హామీల‌పై కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని కూడా ఈ సమావేశంలో నిర్ణ‌యించుకున్నారు.  అమ‌రావ‌తిలో నిర్మించిన‌ నూత‌న అసెంబ్లీ భ‌వ‌న ప్రారంభోత్స‌వ‌ ముహూర్తం ఖ‌రారు చేశారు. మార్చి 2 ఉద‌యం 11.25కు ఆ భ‌వ‌నాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.
    
అలాగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఏకకాలంలో జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో మద్ద్తతు పలికింది.   పంచాయతీలలో మూడంచెల విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరాలని కూడా  అనుకున్నారు.  అయితే.. ఈ నిర్ణయాల సంగతెలా ఉన్నా లోకేశ్ ను ఎమ్మెల్సీగా పంపించాలని పొలిట్ బ్యూరోతో ఏకగ్రీవంగా ఓకే అనిపించడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News