ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. వారూ వీరూ అన్న తేడా లేదు. ఎవరికి వారే రెచ్చిపోతున్నారు. ఇది అనవచ్చు ఇది అన కూడదు అన్నదే లేదు. ఏది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దాన్నే పట్టుకుంటున్నారు. ఒక విధంగా అటెంక్షన్ అట్రాక్షన్ ఈ రెండు విషయాల మీదనే ఏపీ రాజకీయం గిరగిరా తిరుగుతోంది. ఇందులో వ్యవస్థలు పదవులు హోదాలు, మర్యాదలు, కుటుంబాలు అన్నీ అదే పనిగా కొట్టుకుపోతున్నాయి.
ఇదిలా ఉంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కూడా తన పదజాలాన్ని ఈ మధ్యనే మార్చేసుకున్నారు. ఆయన సైతం లాగుడూ పీకుడు లాంటి మాటలు వాడులుతున్నారు. మీ ప్రతాపమా మా ప్రతాపమా అని గర్జిస్తున్నారు. ఏదో ఒకటి తేల్చుకుందామా అని సవాల్ చేస్తున్నారు. ఎంత చేసినా బాబు ఎర్లీ సెవెంటీస్ కాలం నాటి లీడర్. ఆయన కొంత మేరకే వెళ్ళగలరు, అంతకు దాటి అడుగు ముందుకు వేయలేదు.
అందుకేనేమో లోకేష్ లైన్ లోకి వచ్చేశారు. ఆయన యమ జోరు చూపిస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ లోకేష్ అనాల్సినవి అన్నీ అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టూర్ లో లోకేష్ చేసిన కొన్ని కామెంట్స్ అధికార వైసీపీని బాగానే గుచ్చుకున్నాయి. ఫేక్ నా కొడుకులు అని ఆయన ఉపయోగించిన భాష పట్ల వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అయితే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు ఈ లోకేష్ అన్న క్యాకర్టర్ ఎవరు అని ప్రశ్నించారు. నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా కొరగాని లోకేష్ మాటలకు తాను బదులివ్వాలా అని మీడియానే ఆయన ప్రశ్నించడం విశేషం. లోకేష్ ని అంత సభ్యతగా చంద్రబాబు పెంచారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ ఫ్రస్ట్రేషన్ లో ఉండి అవాకులు చవాకులొ మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లోకేష్ చిన్న పిల్లవాడని, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కూడా గోవర్ధనరెడ్డి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఇక పని చేయని మంత్రులని తప్పిస్తాను అని జగన్ అన్నారంటూ వచ్చిన వాటి మీద లోకేష్ ట్వీట్ చేస్తూ మంత్రుల దాకా ఎందుకు సీఎం జగన్ తప్పుకుంటే సరిపోతుంది కదా అని ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ గా మాజీ మంత్రి పేర్ని నాని లైన్ లోకి వచ్చి లోకేష్ మీద గట్టిగానే కామెంట్స్ చేశారు. ఇదే బుద్ధి నీకు 2017 లో ఏమైంది. నాడు తగుదునమ్మా అని మంత్రి పదవి తీసుకున్నావ్ కదా. అపుడే మంత్రులను మార్చడం కంటే మీరే రాజీనామా చేయండి అని నీ అయ్యకు చెప్పలేకపోయావా. నీ తెలివి అంతా మా మీదే చూపిస్తావా లోకేశం అంటూ నాలుగు అంటించేశారు.
మొత్తానికి చూస్తే ఇక్కడ లోకేష్ జోరు పెంచేశారు. నోరు పెద్దది చేస్తున్నారు. ఇక హాట్ కామెంట్స్ ని చేస్తున్నారు. ఫేక్ నా కొడుకులు అన్న మాట ఏపీ పాలిటిక్స్ లోనే పరాకాష్టగానే వైసీపీ నేతలు చూస్తున్నారు. ఏపీ రాజకీయం తన వైపునకు తిప్పుకోవడానికి లోకేష్ గేమ్ చేంజ్ చేశారు అని అంటున్నారు. వైసీపీ నేతలకు మండి తనను టార్గెట్ చేస్తే ఒకటిని నాలుగు అప్పగించాలని ఆయన పొలిటికల్ ప్లాన్ గా ఉన్నట్లుగా ఊహిస్తున్నారు.
మొత్తానికి అగ్రెస్సివ్ మోడ్ లోకి చినబాబు వెళ్ళిపోయారు. ఆయన వ్యూహం ఫలించినట్లుగానే ఉంది. అందుకే వరసబట్టి మంత్రులు మాజీ మంత్రులు కూడా లోకేష్ మీద అటాక్ చేస్తున్నారు. మరి దీంతో అయినా ఏపీ పాలిటిక్స్ వైసీపీ వర్సెస్ లోకేష్ గా మారుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా తాను ఏపీ పాలిటిక్స్ లో టాప్ లో ఉండాలని లోకేష్ వేస్తున్న ఎత్తులు సక్సెస్ అవుతాయా బూమరాంగ్ అవుతాయా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.