బాబు చేలో మేస్తే లోకేష్

Update: 2017-09-01 07:59 GMT
ఆంధ్రప్ర‌దేశ్ లోని ప్ర‌తి పేద‌కుటుంబం నెల‌కు రూ.10 వేల రూపాయ‌లు ఆదాయం సంపాదించుకునే విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం. 2019 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకునే విధంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ముందుకు వెళ్తుంద‌ని మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక సిద్దం అయింద‌ని, ఈ వారంలోని దీని మీద నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు.

రాష్ట్రంలో పేద‌రిక నిర్మూల‌న‌కు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని, ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకుంటున్నామ‌ని, వ్య‌వ‌సాయం - ఆక్వాక‌ల్చ‌ర్ - హార్టిక‌ల్చ‌ర్ వంటి రంగాల‌లో సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించ‌డం ద్వారా గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ది చేసి ల‌క్ష్యం సాధిస్తామ‌ని లోకేష్ వెల్లడించారు.

ఇప్ప‌టికి గ‌త‌ ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణాల ర‌ద్దు - రుణ‌మాఫీ హామీలే స‌రిగ్గా తీర్చ‌లేద‌ని ఆంధ్రాల జ‌నం ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉన్న జాబులు ఊడ‌గొట్టించారు. అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో రైతుల భూములు లాక్కున్నారు. ఇప్పుడు అమ‌రావ‌తి అభివృద్ది పేరు చెప్పి రాష్ట్రంలో పాల‌న‌ను ప‌డ‌కేయించారు.

ప్ర‌భుత్వ యంత్రాంగం అంతా టీడీపీ ప్రైవేటు సేన‌లా మారి పోయింది. ఈ ప‌రిస్థితుల‌లో ఇంకా ప్ర‌జ‌ల‌ను ఏదో ఉద్ద‌రిస్తార‌ని లోకేష్ చెబితే ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో ఉన్నారా ?  ఆవు చేలో మేస్తె దూడ గ‌ట్టున మేస్తుందా .. చెట్టొక‌టి పెడితే విత్తొక‌టి కాస్తుందా .. జ‌నం చెవిలో పూలు పెట్ట‌డంలో చంద్ర‌బాబు స్థాయిని లోకేష్ అందుకున్నాన‌డ‌ని అంటున్నారు.
Tags:    

Similar News