నిన్న విజయవాడలో జరిగిన `జైసింహా` ఆడియో రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ ....తన అల్లుడు నారా లోకేష్ ను ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. లోకేష్ తనకు అల్లుడు కావడం తనకు మాత్రమే కాకుండా...ఆంధ్రప్రదేశ్ కు కూడా అదృష్టమని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే....ఈ `ఆంధ్ర` అల్లుడు....తన మామయ్యను ఓ రేంజ్ లో పొగిడేశాడు. లోకేష్ రాజకీయాల గురించి బాలయ్య కేవలం ఒక్క డైలాగ్ తోనే సరిపెడితే ...లోకేష్ మాత్రం మామను వీర లెవల్ లో మోసేశారు. ఆ వేదికపై బాలయ్య డైలాగ్ ల బీభత్సాన్ని తట్టుకొన్న ప్రేక్షకులు....లోకేష్ బాబు డైలాగులకు తాళలేకపోయారంటే `అతి`శయోక్తి కాదు. తడబడుతూ....సాగిన ప్రసంగంలో .....బాలయ్య తనకు ముద్దుల మామయ్య అని....ప్రేక్షకులకు - అభిమానులకు బాలయ్య అని లోకేష్ అన్నారు.
ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నారని - కానీ - మనసులో ఉన్న మాట డైరక్ట్ గా చెప్పే ఏకైక హీరో మన బాలయ్య అని ఎమోషనల్ గా స్పీచిచ్చేశారు. ఇండస్ట్రీలో మీసాలు తిప్పినా - తొడలు గొట్టినా బాలయ్యేనని....ఆయన ఎనర్జీకి హ్యాట్సాఫ్ అన్నారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే.....దేవాన్ష్ తో కూడా సినిమా తీసేలా ఉన్నాడని ఓ రేంజ్ లో పొగిడేశారు. కొద్దిసేపు సినిమాలను పక్కన బెట్టి బాలయ్య రాజకీయాలపై లోకేష్ మాట్లాడారు. హిందూపూర్ శాసనసభ్యుడిగా....పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తనను ఆయన నిత్యం విసిగించేవారట. రోజూ ఫోన్ చేసి హిందూపూర్ కు రావట్లేదని - నిధులు అడగట్లేదని సతాయించేవారట. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ను ఎంతో నిబద్దతతో నడుపుతూ - ఎంతోమంది పేదలకు బాలయ్య సాయం చేస్తున్నారని లోకేష్ కితాబిచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ క్యాన్సర్ హాస్పటల్ ను కట్టే యోచనలో బాలయ్య ఉన్నారని లోకేష్ చెప్పారు.
మొత్తానికి ఈ ఆడియో వేడుకను వేదికగా చేసుకొని మామా అల్లుళ్లు ఇద్దరూ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారని పలువురు అనుకుంటున్నారు. అసలు బాలయ్య నియోజకవర్గంలో ఎక్కువ రోజులు ఉండడం లేదని,తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కనబెడితే.... ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి నిధులు కావాలని కోరడం సాధారణ విషయమని...అందులో ప్రత్యేకత ఏమీలేదు కదా. ఎవరి ఫ్యామిలీని వారు పొగుడుకోవడం కామన్ అయినా....లోకేష్ బాబు పొగడ్తలు మరీ ఓవర్ గా ఉన్నాయని అనిపించకమానదు. మన గడ్డ మీద...మన అమరావతిలో....ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నామని లోకేష్ ....లోకల్ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. గతంలో బాలయ్య `పైసా వసూల్ ` ఆడియో వేడుక ఖమ్మంలో జరిగిందన్న సంగతి మరిచారు. సినీ పరిశ్రమ ఇంకా హైదరాబాద్ లోనే ఉందని - పూర్తిగా ఇక్కడికి రాలేదన్న విషయాన్ని మరిచారు. మన అమరావతి - మన ఆంధ్ర అన్న అభిమానం ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఓ మంత్రి స్థాయి వ్యక్తి పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేయడం సముచితం కాదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై బాలయ్య సినిమా ఫంక్షన్లన్నింటినీ ఆంధ్రలోనే జరుపుతారా? అన్న ప్రశ్నకు లోకేష్ బాబే సమాధానమివ్వాలి. నంది అవార్డుల తరహాలోనే...ఆధార్...లోకల్ సెంటిమెంట్ ను మరోసారి లోకేష్ కెలికినట్లనిపిస్తోంది. ఇండస్ట్రీ లో పెద్ద తలకాయ అయిన తమ్మారెడ్డి - లోకేష్ ఆధార్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తర్వాత కూడా లోకేష్ బాబు ఈ తరహాలో వ్యాఖ్యానించడం శోచనీయం.