నారా లోకేష్ అలా అనేశాడేంటి..?

Update: 2016-02-25 09:58 GMT
అధికారం ఉన్న ప్రభుత్వం అర్జెంటుగా పడిపోవాలని.. తమకు బలం ఉంటే కూలగొట్టేయాలని ప్రతిపక్ష నాయకుడు కోరుకోవడంటోనూ ఆశ్చర్యం లేదు. కానీ ఆ మాట బయటికి అనేయకూడదు. జగన్ అలా అనేసి ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీల్ని దెబ్బ తీయాలని.. అసలు ప్రతిపక్షమే ఉండకూడదని.. అధికార పార్టీలు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకోవాలి. బయటికి చెప్పేయకూడదు. కానీ అధికార పార్టీ యువ నేత నారా లోకేష్ కూడా అదే తప్పు చేశాడు. గురువారం తిరుపతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని.. అందుకే నాయకుల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నామని లోకేశ్ వ్యాక్యానించారు.

ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల్ని వ్యతిరేకించడం సరికాదని లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. ఆ నాయకుల్ని స్వాగతించండని, వారిని అడ్డుకోవద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించాలని లోకేశ్ సవాలు విసిరారు. టీడీపీలో చేరేవాళ్లెవ్వరికీ తాము ఎలాంటి కమిట్ మెంట్ ఇవ్వలేదని.. తమ అధినేత చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై ఎమ్మెల్యేలు చేరుతున్నారని..  వారిని వద్దని చెప్పలేం కదా అని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటే వచ్చినప్పటికీ.. ఏడున్నర లక్షల ఓట్లు వచ్చిన సంగతి మరవొద్దని లోకేశ్ అన్నారు.
Tags:    

Similar News