వారితో చినబాబు మీటింగ్ అందుకేనా?

Update: 2016-03-27 11:01 GMT
టీడీపీ నేతలతో చినబాబు సమావేశమయ్యారు. పార్టీ నేతలతో మీటింగ్ కావటం పెద్ద విశేషమా? అన్న ప్రశ్న వేయొచ్చు కానీ.. తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా నేతలకు భేటీ కావటం వెనుక ఆసక్తికర అంశం ఉందని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన జ్యోతుల నెహ్రు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్న వేళ.. పార్టీలో కొద్దోగొప్పో ఉండే అసంతృప్తిని ముందే చెరిపోయటం.. నెహ్రు రాక పార్టీకి ఎంత మేలు చేస్తుందన్న విషయాన్ని తెలియజేయటంతో పాటు.. విపక్షాన్ని ఎంతలా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని లోకేశ్ తన భేటీ సందర్భంగా నేతలకు వివరిస్తున్నట్లు చెబుతున్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయటం.. భవిష్యత్తులోనూ పవర్ తమ చేతిలో ఉండేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయని.. అందుకు అనుగుణంగా పార్టీ తీసుకునే నిర్ణయాలకు సానుకూల స్పందన అవసరమన్న విషయాన్ని స్పస్టం చేయటంతో పాటు.. కొత్తవారి రాక కారణంగా పాతవారి ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భరోసాను ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పార్టీ పటిష్టతకు తమ్ముళ్లు చేయూతను ఇవ్వాలన్న మాటను చినబాబు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించే సమయంలో ఆ మాత్రం భేటీ అవసరమే.
Tags:    

Similar News