నాయనా చినబాబూ....
ఎంత ముచ్చటగా యెటకారమాడినావు బిడ్డా.. అచ్చం మీ అయ్య మాదిరిగానే ఉండాదయ్యా నీ యెటకారం గూడా! ఏందీ.. ఏటంటావూ... మా సీమలో రాస్ట్రానికి రెండో రాజధాని బెట్టండి బావూ అని బతిమాలితే.. రాస్ట్రానికేం కరమ - దేశానికే రెండో రాజదానిని దెచ్చి కర్నూల్లో బెట్టుకోండి అంటావా.. అయ్య నీకు రాజకీయాల్తో పాటూ యెటకారాలు బాగానే నేర్పిస్తా ఉన్నట్టుండాదే. అదేదో మీ అయ్య ఆ మాట జెప్పి యెటకారమాడితే.. అదొక యిదానం.
ఆయనేదో పెద్దమడిసిలే.. సిరాకెత్తిందంటే.. సిన్నా పెద్దా మరిసిపోయేంత పెద్ద మడిసైపోయినాడు. ఒక రాజదానికే యేడవలేకపోతండాం అనే దిగుల్లో పెద్దాయన మాట తూలినాడులే అనుకోవచ్చు. నీకేమొచ్చింది సామీ. ఇయ్యాల మీ నాయిన - సెంటరోళ్లు మాకేటీ ఇయ్యలేదు అని ఎలా ఏడస్తన్నాడో.. మాది గూడా అదే ఏడుపే గదా.. మీరు మాకేటీ యియ్యట్లేదనే గదా!
రాజదాని అనే పేరెట్టి.. రాస్ట్రానికొచ్చే అన్నీ దోసుకెళ్లి.. ఆ అమరావతి యెదాన్నే కొట్టాలా బిడ్డా... మా సీమకి హైకోర్టు ఇయ్యమంటే.. మీరిస్తున్నారా ? సమస్తం తీస్కెళ్లి.. ఆడ పచ్చటి కయ్యల్లో బోసేస్తండారే.. సమానంగా డెవలప్ మెంటు అంటే యిదేనా బిడ్డా.. రేప్పొద్దన్న ఈ రాస్ట్రానికి వొస్తే.. మా సీమ మొగం చూసే ఎదవ ఎవుడైనా ఉంటాడా.. సమాదానం చెప్తావా బిడ్డా!
ఇంతకుముందు కూడా మీ అయ్య ఇదే తీరుగా సమస్తం అందరి డబ్బూ దీస్కెళ్లి.. అయిద్రాబాదులో తగలేసినాడు. ఏమైనాది? ఆళ్లు మెట్టుతో గొట్టి తరమలేదా? మీ నాయినా కొడుకులకి బుద్ది రాలేదా బాబూ! ఏదో రవంత నాలుగు రకాలుగా బాగుపడాలంటే.. కనీసం అయకోర్టియ్యండి బాబూ అని బతిమాల్తే.. కాదనిరి. సరే రాజదానికి డిమాండు బెడితే.. కోర్టుకాడికొస్తాదేమో అని ఆసె పడి అడిగినామే అనుకో.. యెటకారాలు జేస్తండావే నాయినా! నీయెటకారాలు పువ్వు పార్టీ వోళ్ల మీదనే అనుకోబాక సామీ.. ఆళ్ల మాట యెనకాల సీమలో ఉండే కోట్ల మంది మడుసులు గూడా ఉండారు.. ఆళ్లందరికీ కడుపుమంట బెట్టినావనుకో.. తమ బతుకు ఏ పాల బడుతుందో.. ఎరికేనా?
దేసంలో రెండో రాజదానిని దెచ్చి యీడ బెట్టుకోండి.. అంటా యెటకారాలు నీకొద్దు నాయినా.. నువ్వు పేరుకు సీమ బిడ్డవే గానీ.. అంతా బస్తీ పుటక మస్తీ పెంపకమే గందా. మన పక్క పల్లెటూళ్లలో నీబోటి పిలకాయిలు ఇట్టాంటి యెటకారాలు ఆడినారంటే.. అతికమాత్ర బిడ్డరా నాయినా అని ఆడిపోసుకుంటారు సామీ.. అంత మాట నీకెందుకులే... సూడబోతే నోట్లో నాలికి నీ మాట యినేట్టుగా కనిపించడం లే... దాన్ని కొంచిం కంట్రోల్లో బెట్టుకో.. అది ఎట్టబడితే అట్టాడిందనుకో.. పాట్లు పడేది మాత్తరం అది గాదు.. నువ్వే..!!