త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నానని వర్మ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. లక్ష్మీపార్వతి దానిపై కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇదంతా ఒకెత్తు. అయితే తాజాగా లోకేష్ పలు విషయాలపై స్పందించారు. ఈ ఎన్టీఆర్ బయోపిక్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఆ చిత్రంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మామయ్య బాలకృష్ణ ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఆ చిత్రంపై మామయ్యే నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయానికి తమ వైపు నుంచి అందరి సహకారం ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడిగా వర్మను నిర్ధారించలేదని తెలిపారు. ఎన్టీఆర్ బయోపిక్ కు మావయ్య తప్ప ఎవరూ న్యాయం చేయలేరని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, బీర్ హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్ వ్యాఖ్యలపై కూడా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో వైసీపీ తప్పుగా ప్రచారం చేస్తోందని లోకేష్ అన్నారు. సదావర్తి భూములపై కోర్టు తీర్పు ప్రకారం ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ. 5 కోట్లు అదనంగా చెల్లించి భూమి కొనాలన్నారు. కానీ ఆయనేమో తన వద్ద వైట్ మనీ లేదంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి బినామీ పేర్లతో కొనుగోలు చేస్తే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.