టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - మాజీ మంత్రి నారా లోకేష్ కు జగన్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. లోకేశ్ భద్రతను వై ఫ్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి కుదించింది. గత జూన్‌లో లోకేశ్‌కు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై ప్లస్‌కు కుదించిన వైసీపీ ప్రభుత్వం తాజాగా దానిని ఎక్స్ కేటగిరీకి కుదించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. గత 8 నెలల్లో లోకేశ్ భద్రతను రెండోసారి కుదించడంతో టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తన భద్రతలో లోపాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి 8 సార్లు లోకేశ్ లేఖలు రాశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ లేఖలకు ప్రభుత్వం స్పందించలేదని - ఉద్దేశ్య పూర్వకంగానే లోకేశ్ కు భద్రత కుదిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతుల ఉద్యమంలో లోకేశ్ చురుగ్గా పాల్గొంటున్నారని - అందుకే లోకేశ్ భద్రతను ప్రభుత్వం కుదించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన భద్రతలో లోపాలున్నాయని లోకేశ్ లేఖలు రాశారని - భద్రతను కట్టుదిట్టం చేయకపోగా కావాలనే కుదిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు లోకేశ్ భద్రతను కుదించారని - టీడీపీ హయాంలో లోకేశ్ కు జడ్ ప్లస్ భద్రత ఉండేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.