ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా ఉంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీరు చేస్తుంటే. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాన్ని చూస్తే.. మిగిలిన రోజులు ఎలా ఉన్నా.. పండుగ రోజున మాత్రం ఎవరూ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు. ఏదైనా మాట్లాడాల్సి ఉన్నా.. పండుగ పక్కరోజున అసలుకు వడ్డీని కలిపి మరీ వాయించేయటం కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది నారా లోకేశ్ మాత్రం అందుకు భిన్నంగా.. దీపావళి వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.
పెట్రోల్.. డీజిల్ మీద కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఆ వెంటనే పలు రాష్ట్రాలు తమ వంతుగా.. రాష్ట్రం పరిధిలో ఉండే వ్యాట్ తగ్గింపుపై నిర్ణయాన్ని తీసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీ.. ఒడిశా లాంటి బీజేపీయేతర పాలనలో ఉన్న ప్రభుత్వాలు సైతం.. పెట్రోల్.. డీజిల్ పైన తమకు తోచిన రీతిలో పన్ను భారాన్ని తగ్గించటం ద్వారా ధరాభారం తగ్గేలా చేశారు. ఇదే విషయాన్ని అందుకున్న నారా లోకేశ్.. ఏపీ సీఎం మీద విరుచుకుపడ్డారు.
వసూల్ రెడ్డి నిద్ర లేచేదెప్పుడు అంటూ మండిపడినఆయన.. పెట్రోల్.. డీజిల్ బాదుడును ఆపేది ఎప్పుడని నిలదీశారు. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించి.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పెట్రోల్.. డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్ని తగ్గిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అందరూ తగ్గిస్తున్నారని.. ఏపీ ముఖ్యమంత్రి ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు.
హర్యానా.. యూపీ ప్రభుత్వాలు పెట్రోల్.. డీజిల్ మీద రూ.12 చొప్పున తగ్గించాయని.. అసోం.. గోవా.. త్రిపుర.. మణిపూర్.. కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్..డీజిల్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా రూ.7 చొప్పున తగ్గించాయని.. వసూల్ రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించటానికి మాత్రం మనసు రాలేదంటూ ఎద్దేవా చేశారు. పన్ను బాదుడుతో ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. దేశమంతా పెట్రోల్.. డీజిల్ మీద పన్నుల్ని తగ్గిస్తున్న వేళ.. ప్రజలపై వసూల్ రెడ్డి కరుణ చూపాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. పండుగపూట లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.