మనం చేయలేనిది పక్కనోడు చేస్తే అసూయ పడేవారెందరో కనిపిస్తారు. ప్రజలకు తమకు అవకాశం ఇచ్చిన వేళ.. పవర్ ప్లే తప్పించి.. ప్రజా ప్రయోజనాలు పట్టని నేపథ్యంలో.. లాగి పెట్టి పీకినట్లుగా ప్రజాతీర్పును ఇచ్చేసి.. ఏపీలో బాబుకు పవర్ పీకేసిన వైనాన్ని చూశాం. నెల వ్యవధిలోనే పాలనపై స్పష్టమైన తీరును ప్రజలకు చేరేలా చేయటమే కాదు.. వ్యవస్థల్ని ప్రక్షాళన చేసి ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అంతకంతకూ చెలరేగిపోతున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో టీడీపీ నేతలు బిక్కచచ్చిపోతున్న పరిస్థితి. జగన్ పాలనలో ఇంత దూకుడును ఏ మాత్రం ఊహించని లోకేశుడి పరిస్థితి ఆగమాగం అవుతోంది. నోరు విప్పి మాట్లాడితే అదో తలనొప్పి అన్న విషయాన్ని గుర్తించిన ఆయన ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్లతో తన అసూయను.. ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
రాజకీయంగా సవాలక్ష ఉండొచ్చు. కానీ.. చక్కగా సాగుతున్న విధానాలపై లేనిపోని గందరగోళాలు సృష్టించేలా ప్రయత్నిస్తున్న తీరు చూస్తే.. లోకేశుడి చిన్న మనస్తత్వానికి అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. రాష్ట్రంలో పాలనను సమూలంగా మార్చేస్తూ.. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇళ్లకే చేరేలా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న వైనం తెలిసిందే.
ఈ విధానం అమల్లోకి వస్తే.. తమ పని అయిపోతుందన్న అనుమానం చినబాబును బలంగా వేధిస్తున్నట్లుంది. అందుకేనేమో ఉత్తుత్తి పేరుతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తనకు బాగా అలవాటైన విషయాల్ని.. ఎదుటోళ్ల మీద పెట్టి బురద వేసే బుద్ధి కొంతమందికి ఉంటుంది. లోకేశ్ తీరు చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా.. పార్టీలకు అతీతంగా వాలంటీర్ల పోస్టులను నియమించాలని తపిస్తున్న జగన్ పై ఆయన ఉత్తుత్తి ఆరోపణల ట్వీట్లు సంధించారు.
అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూశామని.. జగన్ కేసుల్లో ఉత్తుత్తి కంపెనీల్ని చూశామంటూ సెటైర్లు వేసిన ఆయన.. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారంటా అని బాధ పడుతున్నామంటూ తన ఆవేదనను ప్రజల ఆవేదనగా మార్చే వైనం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి.. పోస్టులను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పంచేసుకొని.. అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నాక ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించకుండా ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్ విమర్శలు చూస్తే.. లోకేశ్ అసూయ.. అక్రోశం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.