కొందరి నుంచి కొన్నింటిని అస్సలు ఊహించలేం. కొద్ది కాలం క్రితం వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖంలో చిరునవ్వు తెలుగు ప్రజలకు అరుదైనదని చెప్పాలి. ఆయన నవ్వితే.. బాబుగారికి నవ్వటం కూడా వచ్చా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వారు చాలామంది ఉండేవారు. మనమడి గురించి బాబు మాట్లాడితే.. ఏంటి? మరమనిషిలా పని చేసుకోవటమే తప్పించి.. మరింకేమీ పట్టని బాబులో ఇలాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోయినోళ్లు ఉన్నారు.
అలాంటి చంద్రబాబు రాజకీయ వారసుడు కమ్ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నంతనే ఏం గుర్తుకు వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి లోకేశ్ తన రోటీన్ కు భిన్నంగా పోస్ట్ చేసిన ఒక ట్వీట్ సోషల్ సంచలనంగా మారిందని చెప్పాలి. ఇలాంటి యాంగిల్ ను లోకేశ్ లో ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెప్పాలి.
తన పెళ్లి రోజును పురస్కరించుకొని లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన మరదలు బ్రాహ్మణితో వివాహం జరిగి నేటికి పన్నెండు సంవత్సరాలు. అంటే.. పుష్కరం అన్నమాట. ఇలాంటి స్పెషల్ డేన.. ఆయన రోటీన్ కు భిన్నమైన ట్వీట్ చేశారు. తాను 12 సంవత్సరాలుగా.. ఆ మాటకు వస్తే 144 నెలలు.. 4383 రోజులు.. 1,05,192 గంటలు.. 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు.. తాను బ్రాహ్మణిని ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పారు.
ఆమె లేని ఒక్క సెకను కూడా ఊహించుకోలేనని.. తన గుండె లోతుల్లో నుంచి ప్రేమిస్తున్నట్లు చెప్పారు. ఇలా కాకుండా లోకేశ్ ట్వీట్ ను యథాతధంగా చెబితే ఫీల్ ఉంటుందేమో. . ‘నీవు లేని ఒక్క సెకను కూడా ఊహించుకోలేను.. నా గుండెలోతుల్లో నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి’ అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ కు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. వారి పెళ్లిరోజు శుభాకాంక్షల్ని నెటిజన్లు పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఏమైనా.. బ్రాహ్మణి మీద తనకున్న ప్రేమను చెప్పటమే కాదు.. రోటీన్ కు భిన్నంగా ఒక ప్రేమికుడిగా చెప్పిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ఏమనుకోవద్దు కానీ చినబాబు.. ఇంతకీ ఈ ట్వీట్ ఐడియా ఎలా వచ్చింది? కాస్త.. పంచుకోరు?