టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వంలోకి దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరుఫున ప్రచారం చేయనున్నారు.
ఈ తెల్లవారుజామునే సాగర నగరానికి చేరుకున్న లోకేష్ విశాఖ సహా ఈ నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేంత వరకు నారా లోకేష్ పర్యటనలు కొనసాగుతాయి.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో నారా లోకేష్ పర్యటిస్తారు. దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.
తాజాగా ఎన్నికల ప్రచారం కోసం విశాఖకు నారా లోకేష్ వచ్చారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 8 వరకు లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. విజయవాడ, గుంటూరు మండపేట, పిఠాపురం, మచిలీపట్నం, పెడనలో లోకేష్ పర్యటిస్తారు.
ఇప్పటికే 13 మున్సిపాలిటీలను వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ వైసీపీ హవాను తట్టుకొని ఏమేరకు ప్రభావం చూపుతాడనేది వేచిచూడాలి.