తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ - తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాకు అనుకూలంగా మాట్లాడుతున్న వల్లభనేని వంశీ మధ్య ట్విట్టర్ వార్ ఉద్ధృతంగా సాగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలే చేసుకుంటున్నారు. ఇంతకుముందే లోకేష్ ను పప్పుగా అభివర్ణించిన వంశీ.. తాజాగా లోకేష్ ను పిచ్చి కుక్క అనడం గమనార్హం. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో పెద్ద రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వైకాపా ప్రలోభ పెడుతున్న నేపథ్యంలో లోకేష్ ట్విట్టర్ లో స్పందించాడు.
వంశీ గతంలో వెటర్నరీ వైద్యుడు కావడంతో.. పరోక్షంగా అతడికి తాకేలా జగన్ సంతలో గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొనుగోలు చేశారని నారా లోకేశ్ పోస్ట్ పెట్టాడు. వంశీ-జగన్ కలిసి ఉన్న ఫోటోను అతను జోడించడంతో వంశీ స్పందించాడు. మామూలుగానే వంశీకి దూకుడు ఎక్కువ. మాటలపై అదుపుండదు. లోకేష్ ఇలా తనపై పోస్టు పెడితే ఊరుకంటాడా? ఊరుకోలేరు. వద్దంటే మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడంటూ లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మండలి కూడా రద్దు కానుండటంతో లోకేశ్ కు ఏం అర్థం కావడం లేనట్టుంది. ఉన్న మండలి సీటు కూడా పోవడంతో ఆయనకు పిచ్చి పట్టినట్లుందని.. తన దగ్గర గొర్రెలకే కాదు.. పిచ్చి కుక్కలకు కూడా వైద్యం ఉందని అన్నాడు వంశీ.