తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్లే రాజీనామా చేస్తే మాత్రం నరసాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కావటం ఖాయం. జగన్మోహన్ రెడ్డితో పడని కారణంగా రఘురామ తిరుగుబాటు జెండా ఎగరేశారు. దాంతో ఇటు ప్రభుత్వాన్ని అటు జగన్ను వ్యక్తిగతంగా ప్రతిరోజు టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ పై వ్యక్తిగత టార్గెట్ సృతిమించటంతో సీఐడీ పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.
కస్టడీలో తనను చావగొట్టారన్న ఎంపీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తనను సీఐడీ పోలీసులు ఎలా కొట్టింది, తనను మర్డర్ చేయటానికి ఎలా ప్రయత్నించారనే విషయాన్ని రాజు రకరకాలుగా రాష్ట్రపతి నుండి మామూలు ఎంపీల వరకు వివరించి చెప్పారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని పార్లమెంటులో ఎండగట్టేందుకు ఎంపీ మిగిలిన పార్టీ ఎంపీల సహకారాన్ని కూడా కోరారు. అందుకనే ప్రతి ఎంపీకి తనకు జరిగిన అన్యాయంపై లేఖలు రాశారు. దాంతో విషయం జాతీయస్ధాయిలో బాగా ఫోకసయ్యింది.
అలాంటిది తొందరలోనే తిరుగుబాటు ఎంపీ తన పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ జాతీయస్ధాయిలో మరోసారి సంచలనం కావటం ఖాయం. అప్పుడు ఒక్కసారిగా నరసాపురం నియోజకవర్గం దేశంలో ప్రముఖంగా మారుమోగిపోతుంది. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉపఎన్నికలో మళ్ళీ రఘురామ పోటీ చేయటం ఖాయం. ఏ పార్టీ తరపున పోటీచేస్తారు ? లేకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేస్తారా అన్నది పక్కన పెట్టేద్దాం. రాజు పోటీచేయబోయే ఎన్నికను వైసీపీ కూడా ప్రతిష్టగా తీసుకుంటుంది.
ఎలాగైనా రఘురామను ఓడించేందుకే నూరుశాతం ప్లాన్ వేస్తుంది. దాంతో మరోసారి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం మరోసారి జాతీయ స్ధాయిలో కొద్దిరోజులు సంచలనమైపోతుంది. బహుశా ఉపఎన్నికలో తాను గెలవటం కన్నా జాతీయస్ధాయిలో జగన్ను గబ్బుపట్టించటమే రాజు టార్గెట్ అవ్వచ్చు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనిస్తే తనను తాను రఘురామ చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
మొన్నటి సీఐడీ కేసు, విచారణ, దెబ్బలతో వ్యక్తిగతంగా రాజు దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారు. రేపు ఉపఎన్నిక వస్తే రాజుతో పాటు నరసాపురం నియోజకవర్గం కూడా బాగా పాపులర్ అవ్వటం ఖాయం. మొన్నటివరకు నరసాపురం నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే అంత పాపులర్ కాదు. అలాంటి రాజుగారి పుణ్యమాని ఒక్కసారిగా దేశంలోనే పాపులర్ కాబోతోంది. మరి అంతిమ ఫలితం ఎలా ఉండబోతోందనే విషయం ఇప్పటినుండే ఆసక్తిగా మారింది.