సోనియా తప్పును పీవీపై నెట్టేస్తున్నారా?

Update: 2015-12-13 10:18 GMT
 పాకిస్థాన్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించడానికి ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వమ్ము అవుతున్నాయి. అయితే.... చాలాకాలం కిందటే ఆయన ఇండియాకు లొంగిపోతానని చెప్పాడట... అయితే.. తెలంగాణకు చెందిన ఒక నాయకుడు ఆయన ప్రతిపాదనకు అంగీకరించలేదట. ఆశ్చర్యపోతున్నారా....? కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ మాటలు నిజమే అయితే మనం ఈ విషయాన్ని నమ్మాల్సిందే. అయితే.. దావూద్ వ్యవహారాన్ని డీల్ చేయగలిగే తెలంగాణ నేత ఎవరా అనుకుంటున్నారా...? ఆ అవకాశం ఎవరికి ఉంటుంది. ఈ దేశ ప్రధానిగా ఉన్న పీవీ నరసింహరావు గురించే ఈ చర్చ.  శరద్ పవార్ తాజాగా రాసిన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం గొంతెమ్మ కోరికలు కోరుతూ లొంగుబాటుకు పంపిన ప్రతిపాదనలను అప్పటి ప్రధాని పీపీ నరసింహారావు వ్యతిరేకించారని ఎన్సీపీ అధినేత శదర్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షరతులకు పీపీ అంగీకరించి ఉంటే అండర్ వరల్డ్ డాన్ లొంగిపోయి ఉండేవాడని ''ఆన్ మై టర్మ్స్: ఫ్రం ది గ్రాస్ రూట్స్ టు ది కారిడార్ ఆఫ్ పవర్'' అంటూ రాసిన పుస్తకంలో శరద్ పవార్ ప్రస్తావించారు. ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీని దావూద్ సంప్రదించాడని...లొంగిపోయి విచారణకు సహకరిస్తానని అయితే తనను జైల్లో ఉంచకుండా గృహ నిర్భంధంలో ఉంచాలన్నది దావూద్ ప్రధాన డిమాండ్ అని వివరించారు. ఈ విషయంపై దావూద్ ప్రతిపాదనలను అప్పడు మహారాష్ట్ర సీఎంగా ఉన్న తాను..ప్రధాని పీవీతో చర్చించినట్లు చెప్పారు.దావూద్ డిమాండ్లను పీవీ అంగీకరించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పుస్తకంలో వివరించారు.

అయితే... పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన నిర్ణయాలను సోనియాయే ప్రభావితం చేసేవారు కాబట్టి, దావూద్ విషయంలోనూ ఆమె నిర్ణయం మేరకే పీవీ అలా వ్యవహరించి ఉంటారన్న వాదనా వినిపిస్తోంది. మొత్తానికి పవార్ మాత్రం మెత్తని మనిషి అయిన పీవీపై ఆ తప్పంతా వేసే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తోంది.
Tags:    

Similar News