అవార్డులు ఇచ్చే వేళ ఆ ఇష్యూలో దేశానికి జరిగిన డ్యామేజ్ చెప్పిన నారాయణమూర్తి
తిన్నామా? పడుకున్నామా? లేచామా? మన పని మనం చూసుకున్నామా? మన సంపదను పెంచుకున్నామా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు జాగ్రత్తగా ఇచ్చుకుంటూ మరేమీ పట్టించుకోని తత్త్వం సామాన్య ప్రజానీకంలో కంటే కూడా అత్యుత్తమ స్థాయికి చేరుకున్న ప్రముఖులు పలువురిలో కనిపిస్తుంటుంది.
తమ చుట్టూ ఉన్న పరిస్థితుల మీదా.. పాలకుల మీద మనసులో ఉండే బాధ..కోపాన్ని బయటకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి వేళ.. ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామం మీద ఓపెన్ గా మాట్లాడిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇటీవల భారత్ లో తయారైన దగ్గు మందు జాంబియాలోని 66 మంది చిన్నారుల మరణాలకు కారణమైన వార్తలు సంచలనంగా మారటంతో పాటు.. భారత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని చెప్పాలి. మన ఉత్పత్తులపై ఉన్న ఇమేజ్ అంతంతమాత్రం అన్నట్లుగా ఉండే పరిస్థితుల్లో ఇలాంటివి పేరు ప్రఖ్యాతుల మీద మరింత ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇదే విషయాన్ని నారాయణమూర్తి ప్రస్తావించారు.
తాజాగా బెంగళూరులోని ఇన్పోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. మరే పారిశ్రామివేత్త కానీ.. ఐటీ పెద్ద మనిషి కానీ ఈ అంశం గురించి మాట్లాడని వేళలో.. నారాయణ మూర్తి మాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. కరోనా టీకాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసిన వేళ.. ఈ దగ్గుమందు అపవాదు భారత పరిశోదనా రంగానికి మచ్చ తెస్తుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధుల్ని పొందే విషయంలో విద్యా సంస్థలు పడుతున్న అవస్థల్ని ప్రస్తావించారు. రీసెర్చ్ సంస్థలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. భారత సమాజం ఎదుర్కొనే గన్యా..
డెంగీలకు ఇంకా టీకాల్ని కనుగొనకపోవటం కచ్ఛితంగా పరిశోధనా రంగం ఫెయిల్యూర్ గా అభివర్ణించారు. మొత్తంగా వ్యవస్థలోని లోపాన్ని మొహమాటం లేకుండా ఎత్తి చూపటమే కాదు.. దేశానికి చెడ్డ పేరు తెచ్చిన అంశాలను ఇలా ఓపెన్ వేదిక మీద మాట్లాడటం ద్వారా.. కొత్త చర్చకు నారాయణ మూర్తి తెర తీశారని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.