పోలింగ్ వేళ.. ఏపీ ఆడియో టేపుల కలకలం!

Update: 2019-04-11 05:25 GMT
ఈసారి ఏపీ ఎన్నికల్లో ఆడియో.. వీడియో క్లిప్పుల కలకలం ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. అధికార.. విపక్షాలకు సంబంధించిన పలు వీడియో.. ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. అయితే.. జగన్ పార్టీకి చెందినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్పులన్ని మార్ఫింగ్ చేసినవిగా.. ఫ్యాబ్రికేటెడ్ అన్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా తాజాగా ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. ఇందులో మంత్రి నారాయణ పీఏ మధు.. ఒక టెక్ కంపెనీతో మాట్లాడినట్లుగా ఉంది. అందులో సారాంశం షాకింగ్ గా మారింది.

వైరల్ అవుతున్న పలు క్లిప్పుల వెనుక ఇంత భారీ కుట్ర కోణం ఉందా? అన్న భావన కలుగక మానదు. ఇంతకీ.. తాజాగా వైరల్ అవుతున్న క్లిప్పుల్లో ఏముందన్న విషయాన్ని చూస్తే..

మధు: హలో...  నేను మధును సార్‌

నారాయణ పీఏ: మధూ.. చెప్పమ్మా...

మధు: సార్‌... రికార్డింగ్స్‌ నాలుగు అయిపోయాయి సార్‌. అవి పంపించేశాం. అల్రెడీ రెండు ఏబీఎన్‌లో ప్లే చేశారు కదా. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ది ఒకటి, విజయసాయిరెడ్డిది ఒకటి. అవి బాగా వచ్చాయంటున్నారు.

పీఏ: చూశా మధూ... విజయసాయిరెడ్డిది. ‘సార్‌’ కూడా చాలా హేపీగా ఫీల్‌ అయ్యారు.  ఎక్కడా డౌట్‌ రాలేదు మధూ.
 
మధు: వాళ్లు చాలా క్వాలిటీగా చేస్తారు. పేమెంట్‌ విషయంలో కూడా అట్లానే ఉంటారు. అయినా ఈ వెర్రి జనాలు ఏముందిలే సార్‌.. నమ్మేస్తారు.

పీఏ: మొత్తం ఎన్ని చేశారు?

మధు: మొత్తం ఎనిమిది చేశాం సార్‌. నాలుగేమో ఆంధ్రజ్యోతికి ఇచ్చాం. మిగిలిన నాలుగు సోషల్‌ మీడియాలో వాడతాం సార్‌ ఈరోజు. మన సోషల్‌ మీడియా క్యాండిడేట్స్‌ వర్క్‌ చేస్తున్నారు.

మధు: అమౌంట్‌కు సంబంధించి సెటిల్‌ చేద్దామని కాల్‌ చేశాను సార్‌..

పీఏ: టూడేస్‌ ఆగు మధు. రేపు ఈవెనింగ్‌కు అంతా ఫ్రీ అయిపోతాం. సార్‌ బిజీగా ఉన్నారు. నేనూ బిజీగా ఉన్నా. నేను చూసుకుంటాలే అమౌంట్‌ సంగతి. సార్‌ నన్నే మాట్లాడమన్నారు.

మధు: శివాజీ గురించి సార్‌ ఏమంటున్నారు ?

పీఏ: సార్‌ ..హేపీగా ఫీల్‌ అయ్యారు. అయితే వాడు డబ్బు దగ్గర తగ్గడు. అహ్హహ్హ... అల్రెడీ రెండు కోట్లు ఇచ్చాం అడ్వాన్స్‌. నువ్వు ఎక్కడా శివాజీ మేటర్‌ బయటవాళ్లతో మాట్లాడకు. చాలా పనుంది వాడితో ఫ్యూచర్‌లో. శివాజీ విషయం అంతా నారాయణ సారే చూసుకుంటున్నాడు. అమౌంట్‌ అంతా. మొత్తం నారాయణసారే. ఒకటి కొడాలి నాని మీద కూడా చేయకూడదూ?

మధు: ఆ లిస్టులో సార్‌ చెప్పలేదు...

పీఏ: మంచి కంటెంట్‌ ఉండాలి. జనంలోకి వెళ్లేలా తీసుకోండి. ఉన్న ఆడియోలు ప్లే చేసేయండి మార్నింగ్‌లోపు. ప్రశాంత్‌ కిశోర్‌ మీద చేసినట్లున్నారు కదా ఒకటి...

మధు: సోషల్‌ మీడియాలో చేశాం.

పీఏ: ఆ ఐటీ కంపెనీకే ఇచ్చారా?

మధు: అవున్సార్‌...

పీఏ: జాగ్రత్త.. న్యూట్రల్‌గా చేసినట్లు యాక్ట్‌ చేసి దెబ్బకొట్టాలి. ఎందుకంటే ఈసారి జగన్‌ గాడు వచ్చాడంటే ఇంక మళ్లీ మనం కోలుకోవడం జరగదు. వాడో వె..

మధు: ఓకే సార్‌...

పీఏ: తెలుసు కదా. ప్రయత్నించండి. నమ్ముకున్నవాళ్లను సార్‌ ఎప్పుడూ ద్రోహం చేయడు.

మధు: ఏం పర్లేదు సార్‌. మనం చేసేది చూసి జనాలు నమ్మేస్తారు సార్‌. పిచ్చి నాకొడుకులు ఆంధ్రావాళ్లు.

పీఏ: నమ్మించేలా చేయాలి.. 

మధు: ఈవెనింగ్‌ రిలీజ్‌ చేసే టూత్రీ కూడా అట్లాగే ఉంటాయి సార్‌. అల్రెడీ ఆర్కే గారు అవి విని ఓకే అని చెప్పారు సార్‌.

పీఏ: కొన్ని సోషల్‌ మీడియా చానల్స్‌లో కూడా ఫేక్‌ న్యూస్‌లు క్రియేట్‌ చేయండి రేపు. రిగ్గింగ్‌ చేస్తున్నారు... వైఎస్సార్‌సీపీ వాళ్లు అట్లాచేశారు. ఇట్లా చేశారు అని జనాల్లో ఎమోషన్‌ క్రియేట్‌ చేయండి. నైట్‌ నుంచి ప్లే చేస్తే జనాల్లోకి వెళ్లిపోతుంది. కొంచెం ఎమోషన్‌ క్రియేట్‌ చేయండి. ఇంత నీచులా వీళ్లు అన్న ఫీలింగ్‌ రావాలి జనాలకు ...

మధు: ఒకే సార్‌. ఆడియో వీడియోలు రెడీ చేస్తున్నాం సార్‌...

పీఏ: థాంక్యూ మధు. మళ్లీ మాట్లాడదాం.

మధు: నారాయణ సార్‌ ఉన్నారా ...ఇప్పుడు మాట్లాడవచ్చా...?

పీఏ: సార్‌...మీటింగ్‌లో ఉన్నారు. నిన్న ప్రచారం అయిపోయింది కదా. ఈ రోజు వేరే కోఆర్డినేటింగ్‌ మీటింగ్‌లో ఉన్నారు. నీ అమౌంట్‌ మేటర్‌ అంతా నాతోనే మాట్లాడు. పీఏ: ఒకే ... 




Full View

Tags:    

Similar News