బిగ్ బాస్ పై మళ్లి రెచ్చిపోయిన నారాయణ.. బ్యాన్ చేయాల్సిందేనట!

Update: 2022-05-02 05:28 GMT
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది. ఈ కార్యక్రమంపై సంప్రదాయవాదుల నుంచి ఎన్ని విమర్శలున్నా కూడా ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇక సీపీఐ నారాయణ లాంటి వారైతే ‘బిగ్ బాస్’ను బ్రోతల్ హౌస్ తో పోల్చాడు. ఆ షోను నిర్వహిస్తున్న హీరో నాగార్జునపై నిప్పులు చెరిగాడు. తాజాగా ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ పై విచారణ సాగింది. బిగ్ బాస్ తో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రియాలిటీ షోలు సమాజానికి మంచి నేర్పాలని, ఈ షో తో యువత చెడుదారిలో వెళ్తోందని తెలిపింది. అసభ్య పదజాలం వాడుతూ అశ్లీల ప్రదర్శన ఎక్కువవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షో పై 2019లో పిటిషన్ ధాఖలైంది.

అయితే అప్పటి నుంచి ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. తాజాగా ఈ పిల్ పై ఏపీ హైకోర్టు స్పందించింది. దీనిపై సోమవారం పూర్తిస్థాయిలో విచారిస్తామని  జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది. అంతేకాకుండా ఈ పిటషన్ వేసిన వారిని హైకోర్టు అభినందించింది.

2019లో జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ పు తాజాగా ఏపీ హైకోర్టు స్పందించింది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల యువత  పెడదారి పడుతోంది, ఇందులో ఎక్కువగా అశ్లీల ప్రదర్శన చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ వంటి రియాలిటీ షో వల్ల సమాజం దెబ్బతింటోందన్నారు. ఈ మేరకు జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసం తెలిపింది. మా  పిల్లలు బాగున్నారు. ఇలాంటి షోతో మాకేం పని అని ప్రజలు అనుకుంటే సరిపోదని, భవిష్యత్ లో సమస్య ఎదురైనప్పుడు కూడా పట్టించుకోరని కోర్టు తెలిపింది. సోమవారం ఈ పిటిషన్ పై పూర్తిస్థాయి విచారణ చేపడుతామని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. శనివారం ఆయన చిత్తూరు జిల్లా నగరిలో విలేకరులతో మాట్లాడారు. యువతను పెడదారి పట్టిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో తాను హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే సూచించిందని.. దీన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలని హైకోర్టుకు నారాయణ విన్నవించారు.
Tags:    

Similar News