జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే కోన‌సీమ‌ను కాల్చేసింది: నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-05-25 13:30 GMT
కోనసీమ జిల్లాలో  చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లు.. వివాదాలు.. మంత్రి, ఎమ్మెల్యే గృహ ద‌హ‌నాల‌పై ప‌లువురు నాయ‌కులు త‌మ శైలిలో విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. కోన‌సీమ‌లో జ‌రిగిన దాడిని కుల రాజ‌కీయంగా చూడ‌లేమ‌ని.. ప్ర‌భుత్వంపైనా.. సీఎం జ‌గ‌న్‌ప‌నా ఉన్న వ్య‌తిరేక‌త‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని, కోన‌సీమ‌కు గ‌తంలోనే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

జగన్ ప్రభుత్వంపై ఉన్న‌ వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని   నారాయణ మీడియాకి విడుదల చేసిన వీడియో సందేశంలో అభిప్రాయపడ్డారు. జిల్లాల విభజన తరుణంలోనే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోకుండా సీఎం జగన్ ఊగిసలాట ధోరణిలో వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

కోనసీమ కు అంబెడ్కర్ పేరు విషయంలో ప్రారంభం అయిన ఘర్షణలు చీలికి చిలికి గాలివానలా మారాయని చెప్పారు. చివరకు మంత్రి విశ్వరూప్ గృహ దహనం వరకు వెళ్లిందని పేర్కొన్నారు.

ఈ ఘటనను కుల పరమైన ఘర్షణ గా చూడలేమని అన్నారు. ప్రభుత్వం పై వ్యతిరేకతకు ప్రతిబింబంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలి చూస్తున్న ప్రభుత్వం విధానాలపై వ్యతిరే క ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయాయని గుర్తు చేశారు.

జిల్లాల ఏర్పాటు తరుణంలోనే అంబెడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. ఆ సమయంలో మొండిగా వ్యహరించి అనంతర కాలంలో ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరిని ప్రదర్శిం చారని ఆరోిపించారు

ఏ విషయంలో అయినా స్పష్టత ప్రదర్శించే సీఎం ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఫలితంగా కోనసీమలో ఘర్షణలు వచ్చాయని. మొత్తంగా చూస్తే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే చోటు చేసుకుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మ స్తుతి పరనింద పనికి రాదని ప్రభుత్వానికి సూచించా రు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
Tags:    

Similar News