శత్రు దేశాల బారి నుంచి దేశ భూభాగాన్ని రక్షించుకోవడంతో పాటుగా శత్రు దేశాలు దండెత్తడానికి వస్తే... ఈ దండయాత్రలను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ నిత్యం సిద్ధంగానే కాకుండా బలంగానూ ఉందంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ వైపు చెబుతున్నా... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్న వాదనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి. శత్రు దేశాలను నిలువరించాలంటే... సైనిక విభాగాలకు అవసరమైన మేర సాధన సంపత్తి ఉండాలి. అయితే భారత సైనిక దళాల్లో ఈ విషయంలో మోదీ సర్కారు భరోసా నింపలేకపోతోందన్న విమర్శలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన సందర్బంగా మునుపటి ప్రభుత్వాల మాదిరిగా కాకుండా... తమ ప్రభుత్వం సైనిక బలగాలకు పూర్తి మద్దతుగా నిలుస్తుందని - రక్షణ రంగానికి ఇప్పటిదాకా ఏ ఒక్క ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తామని మోదీ ఘనంగానే ప్రకటించారు.
ఈ ప్రకటన చూడటానికి ఘనంగానే ఉన్నా... ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం సైనిక బలగాల్లో ఏమాత్రం భరోసా నింపలేకపోగా.. వాటిలో ఓ రకమైన అభద్రతాభావాన్ని నింపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత భూభాగంలోని ఏదో ప్రాంతాన్ని హస్తగతం చేసుకునేందుకు ఏమాత్రం అవకాశం చిక్కినా విరుచుకుపడేందుకు గోతి కాడి నక్కల్లా కాసుక్కూర్చున్న పాకిస్థాన్, చైనాలను నిలువరించే విషయంలో ఈ తరహా ఇబ్బందులు నిజంగానే ఆందోళన కలిగించేవే. భారత సైనిక రంగంలో మిలిటరీతో పాటుగా వాయుసేన - నేవీలు కీలక విభాగాలు. ప్రస్తుతం మోదీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ మూడు విభాగాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి సంతృప్తిగా లేవన్నది సుస్పష్టం. కేటాయింపులు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నా... వేతనాలు - పెన్షన్లకే సరిపోతున్నాయి తప్పించి... శత్రు దేశాల చేతుల్లోని ఆయుధ సంపత్తి కంటే మెరుగైన రీతిలో ఆయుధాల సేకరణ కాదు కదా... కనీసం వాటి స్థాయిలో కూడా ఆయుధాలను సేకరించుకునే పరిస్థితి కనిపించడం లేదన్న మాట బలంగానే వినిపిస్తోంది.
ఈ తరహా పరిస్థితి సైనిక విభాగాల్లో ఏ రీతిన ఉందన్న విషయాన్ని పరిశీలిస్తే... దేశ అవసరాలకు తగ్గట్లు 2027నాటికి భారత్ వద్ద 200 యుద్ధనౌకలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2027నాటికి కేవలం 175 మాత్రమే సమకూరే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దళం వద్ద 130 యుద్ధనౌకలు మాత్రమే ఉన్నాయి. మరో 50 వరకు నిర్మాణం - వివిధ దశల్లో ఉన్నాయి. మరోపక్క రక్షణ బడ్జెట్ లో నావికాదళం వాటా 18శాతం(2012లో) నుంచి 2019-20లో 13శాతానికి పడిపోయింది. సబ్ మెరైన్ విభాగాన్ని బలోపేతం చేసే సమయంలో ఈ తగ్గుదల కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. 1980ల్లో భారత్ వద్ద 21 సబ్‌మెరైన్లు ఉన్నాయి.. ఇప్పుడు వాటి సంఖ్య 15కు పడిపోయింది. కాకపోతే అరిహంత్ - చక్ర వంటి అణుశ్రేణి జలంతర్గాములు ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే చర్య. ప్రస్తుతం ఉన్న వాటిల్లో కూడా చాలా వాటి జీవిత కాలం చరమ దశకు వచ్చింది. మరోపక్క చైనా మాత్రం దాదాపు 65 సబ్ మెరైన్లతో భారత్ పై కన్నేసి ఉంచింది.
రక్షణ నిధుల్లో సింహభాగం కేవలం జీతాలు - పింఛన్లకే వెళ్లిపోతుండటంతో అధునికీకరణ ముందుకు సాగటంలేదు. ఒక వేళ కేటాయించినా అప్పటికే చేసిన కొనుగోళ్లకు చెల్లింపులకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఒక సారి భారీ కొనుగోళ్లు చేపడితే మరికొన్నేళ్లు కొత్త ఆయుధాలు ఊసెత్తలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలిసారి బడ్జెట్ రూ.3లక్షల కోట్లను దాటింది. కానీ ఇది జీడీపీలో 2శాతం కంటే తక్కువ. మరోపక్క చైనా మాత్రం తన జీడీపీలో 3శాతం వరకు రక్షణ రంగంపై ఖర్చు చేస్తోంది. ఇక పాకిస్థాన్ అయితే ఏకంగా 3.5శాతం వెచ్చిస్తోంది. భారత్ లో ప్రతి 1000 మంది ప్రజలకు 1.25 మంది సైనికులు ఉండగా.. చైనాలో ప్రతి 1000 మందికి 2.23 మంది సైనికులు.. పాక్‌లో 4.25 మంది సైనికులు ఉన్నారు. ఈ లెక్కన భారత్ దళాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.
వాయుసేన పరిస్థితి ఏమీ అంత ఘనంగా లేదు. గత ఏడాది మూలధన కేటాయింపుల్లో వాయుసేనకు 38శాతం దక్కాయి. అంటే సుమారు రూ.39,303 కోట్లన్నమాట. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద వాయుసేన బలం నానాటికీ తగ్గిపోతోంది. 42 స్క్వాడ్రన్ల బలం అవసరం కాగా.. ప్రస్తుతం అది 28కు చేరింది.. భవిష్యత్తులో ఇది ఇంకా వేగంగా తగ్గిపోనుంది. వాయుసేన 104 విమానాల కొనుగోలుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరోపక్క దేశీయ తేజస్ మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రాఫెల్ యద్ధవిమానాల రాక ఒక్కటే వాయుసేనకు కొంత ఊరటగా మిగిలింది. కార్గిల్ యుద్ధంలో ఈ లోపాలు కనిపించినా.. బాలాకోట్ అనంతరం దాడుల్లో మాత్రం స్పష్టంగా కనిపించాయి. యాంటీ జామింగ్ పరికరాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక పాక్ వద్ద విమానాలపై అమర్చే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్‌లను పాక్ స్వీడన్ నంచి మరో నాలుగు కొనుగోలు చేసింది. దీంతో ఈ రకమైన విమానాల సంఖ్య పాక్ వద్ద 10కి చేరింది.. భారత్ వద్ద మాత్రం ఇలాంటివి కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి.