ఏపీని జ‌గ‌న్ కు క‌ట్ట‌బెట్టేసిన మోడీషా!

Update: 2019-05-31 11:30 GMT
ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఎంత‌లా మారిందో తాజా ప‌రిస్థితిని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఐదేళ్ల క్రితం ఇదే స‌మ‌యానికి ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతూ ఉండేది. తాము మ‌రి కాస్త క‌ష్ట‌ప‌డితే.. మ‌రింత బ‌లోపేతం కావ‌ట‌మే కాదు.. కేంద్రంలోనూ కీల‌క‌భూమిక పోషించే వీలు క‌లుగుతుంద‌న్న మితిమీరిన ఆత్మ‌విశ్వాసాన్ని వ్య‌క్తం చేసినోళ్లు లేకపోలేదు.

అనూహ్యంగా ఏపీ ప్ర‌త్యేక హోదా ఎపిసోడ్ తో ఏపీలో దారుణంగా దెబ్బ తింది బీజేపీ ఏపీ శాఖ‌. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క సీటును సొంతం చేసుకోలేక‌పోయింది. ఢిల్లీలోని అధినాయ‌క‌త్వం అడుగుల‌కు మ‌డుగులు ఒత్తినా ఎలాంటి ఫ‌లితం రాని ప‌రిస్థితి. ప్ర‌జ‌ల్లో ప‌ట్టు కోల్పోయిన ఏపీ బీజేపీ నేత‌లు.. ఢిల్లీలోని మోడీషాల మ‌న‌సును దోచుకోవ‌టంలోనూ ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి.

దీంతో.. ఏపీ బీజేపీ అంటేనే అగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది బీజేపీ అధినాయ‌క‌త్వం.త‌మ సొంత ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే కూడా పార్టీ లైన్ ను క్రాస్ చేయ‌కుండా ఉన్నందుకు త‌గిన శాస్తి జ‌రిగింద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే.. రానున్న ఐదేళ్ల‌లో ఏపీకి బీజేపీ నేత‌ల‌కు గ‌డ్డు కాలం త‌ప్పదంటున్నారు. జ‌గ‌న్ తో మోడీషాల దోస్తీ అంత‌కంత‌కూ పెర‌గ‌టం.. ఏపీ బీజేపీ నేత‌ల్ని న‌మ్ముకునే క‌న్నా జ‌గ‌న్ ను న‌మ్ముకోవ‌టం మేల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏపీ బీజేపీకి సంబంధించి స్టేట‌స్ కో మొయింటైన్ చేస్తూ.. జ‌గ‌న్ కు ప‌రోక్షంగా ఇవ్వాల్సిన మ‌ద్ద‌తు ఇవ్వ‌టం ద్వారా.. అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్ బ‌లాన్ని త‌మ బ‌లంగా మార్చుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. పార్టీని ప్ర‌క్షాళన చేయ‌టం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మ‌ని.. దానికి బ‌దులుగా.. ఏపీ స్థానే తెలంగాణ మీద ఫోక‌స్ పెడితే ఫ‌లితం వెనువెంట‌నే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మోడీ షాలు దీనికే మొగ్గిన‌ట్లుగా చెబుతున్నారు. ఏపీని జ‌గ‌న్ కు క‌ట్ట‌బెట్టేశారంటూ ఏపీకి చెందిన బీజేపీ నేత‌లు కొంద‌రు త‌మ ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చేస్తున్న వ్యాఖ్య‌ల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఏపీ క‌మ‌ల‌నాథుల‌కు మ‌రిన్నిక‌ష్టాలు ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే... మోడీ షా ద్వయం అంత నమ్మదగిన డిపెండ్ అవదగ్గ మనుషులని చెప్పలేం. ఇపుడు టీడీపీ ఆల్మోస్ట్ చచ్చుపడిన నేపథ్యంలో ప్రభావిత శక్తిగా ఎదగడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఇందుకోసం అన్ని మార్గాలను వారు వాడే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో దాన్ని వాడుకుని ఏపీలో బలపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే భవిష్యత్తులో ఏపీ బలమైన త్రిముఖ పోరును చూడొచ్చు.
Tags:    

Similar News