సొంత రాష్ట్రంలో ఇసుమంత త‌గ్గ‌ని మోడీషా హ‌వా!

Update: 2019-05-23 09:11 GMT
ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వ‌స్తే.. త‌ర్వాతి ఎన్నిక‌ల నాటికి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎదుర్కొనే ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. అలాంటి లేకున్నా రెండు ట‌ర్మ్ లు అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి ఎక్క‌డైనా క‌నిపిస్తుంది. అందుకు భిన్నంగా. ఏళ్ల‌కుఏళ్లు.. ట‌ర్మ్స్ కు ట‌ర్మ్స్ ఘ‌న విజయాన్ని అందించే రాష్ట్రాలు దాదాపుగా క‌నిపించ‌వు. కానీ.. ఆ అరుదైన రికార్డును మోడీషాలకు మాత్రం సొంతంగా చెప్పాలి.

2014 ఎన్నిక‌ల్లో మోడీ మేజిక్ తో బీజేపీ ఢిల్లీలో ప‌వ‌ర్లోకి వ‌చ్చినా.. ఆయ‌న సొంత రాష్ట్రమైన గుజ‌రాత్ లో మాత్రం ఆయ‌న ప‌ట్టు మిస్ కావ‌ట్లేదు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన మోడీ.. బీజేపీకి కంచుకోట‌గా త‌న రాష్ట్రాన్ని మార్చేశారు. ప్ర‌ధాని అయ్యాక గుజ‌రాత్ లో బీజేపీ ఛ‌రిష్మా త‌గ్గ‌తుంద‌ని భావించారు. అందుకు భిన్నంగా ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ.. మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్లోకి రాకున్నా కాంగ్రెస్ పెద్ద ఎత్తున సీట్ల‌ను సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ మీద మోడీషాల ప‌ట్టు త‌గ్గుతుందా? అన్న సందేహం వ్యక్త‌మైన ప‌రిస్థితి. అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. గుజ‌రాత్ లో ప‌ట్టు కోల్పోయే చాన్సే లేద‌న్న విష‌యాన్ని తాజా ఫ‌లితాల‌తో మ‌రోసారి నిరూపించారు మోడీషాలు. గుజ‌రాత్ రాష్ట్రంలో 26 ఎంపీ స్థానాలు ఉంటే.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ 26  స్థానాల్లో అధిక్య‌త‌లో దూసుకెళుతున్న ప‌రిస్థితి.

పోలింగ్ అనంత‌రం వెల్ల‌డించిన ఎగ్జిట్ ఫ‌లితాల్లో బీజేపీకి పాతిక నుంచి 26 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించ‌గా.. క్లీన్ స్వీప్ చేస్తూ వెలువ‌డుతున్న అధిక్య‌త‌ల్ని చూస్తే.. గుజ‌రాత్ మీద మోడీషాల ప‌ట్టు ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మైంద‌ని చెప్ప‌క‌త ప్ప‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాల ప్ర‌కారం 543 స్థానాలున్న లోక్ స‌భ‌లో 341 స్థానాల‌తో దూసుకెళుతుంది. ఎగ్జిట్ పోల్స్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఎన్డీయే కూట‌మి త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News