ఎన్నికలు ఏదైనా ప్రచారాన్ని భారీగా నిర్వహించటం పార్టీలకు మామూలే. వెరైటీ ప్రచారంతో ఓటర్ల మనసుల్ని దోచేసుకునేందుకు రాజకీయ పార్టీలు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటాయి. తాజాగా అలాంటి వెరైటీ ప్రచారాన్ని చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యూపీ కమలనాథులు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత ప్రాంతమైన గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు వేసిన ఎత్తుగడ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను పోలిన వ్యక్తులతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రముఖ నేతల పోలికలతో ఉన్నవ్యక్తులతో చేయిస్తున్న ప్రచారం అక్కడి స్థానికుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. రణవీర్ దాహియా అనే వ్యక్తి మోడీ రూపంలో అలరిస్తుండగా.. రాజేంద్ర అగర్వాల్ అమిత్ షా వేషంలో సందడి చేస్తున్నారు. వీరిని ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి రప్పించటం గమనార్హం.
రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లే నకిలీ అగ్రనేతల ప్రచారం ఓట్ల సంగతి తర్వాత.. సెల్ఫీల్ని తీసుకునేందుకు విపరీతంగా పోటీపడుతున్నారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే వ్యక్తులతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయిస్తుండటం విశేషం. అసలోళ్లను వదిలేసి.. వారిని పోలి ఉండే నకిలీలతో చేయిస్తున్న ఈ ప్రచారం చూసి బీజేపీ నేతల తెలివికి ముక్కున వేలేసుకుంటున్నారు.