పెద్ద నోట్ల రద్దు విషయంలో మరోమారు బీజేపీ ద్వంద వైఖరి బయటపడిందని అంటున్నారు. నల్లధనం - నకిలీ నోట్ల నుండి విముక్తికోసం పెద్దనోట్ల రద్దు తప్ప మరో మార్గం లేదన్నట్లు ప్రధానమంత్రి నుండి బీజేపీ నేతలు అందరూ ప్రస్తుతం మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై 2005లో బీజేపీ భిన్నంగా స్పందించింది. 2005కు ముందు ముద్రించిన కొన్ని పెద్దనోట్లను వెనక్కి తీసుకుని, వాటి స్థానంలో కొత్తవి విడుదల చేయాలని అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెద్దనోట్లను వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా బీజేపీ 2005లో అభివర్ణించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ ఈ మేరకు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర నేతలూ ఇదే విధంగా స్పందించారు.
అధికారింగా బీజేపీ తరఫున మీనాక్షి లేఖీ విడుదల చేసిన ఆ ప్రకటనలో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలన్న డిమాండ్ ను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ విమర్శించింది. 'ఇది తీవ్రమైన ప్రజా వ్యతిరేక చర్య. నిరక్షరాస్యులు - బ్యాంకింగ్ సౌకర్యం లేని పేద ప్రజలు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. నల్లధనం నివారణకు ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. భారత దేశంలో 65శాతం ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవు. వీరిలో అధికభాగం నిరుపేదలు. నిరక్షరాస్యులు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరందరు నగదు రూపంలోనే నిలువ చేసుకుంటారు. వారందరు ప్రస్తుతం బాధితులుగా మారుతారు. ' అని బీజేపీ అప్పట్లో పేర్కోంది. నల్లధనాన్ని వెలికితీయలేక - కేవలం జిమ్మిక్కు చర్యగానే నోట్లరద్దుకు ప్రభుత్వం దిగిందని విమర్శించించింది.
కట్ చేస్తే 2016లో 'పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయంతో నిజాయితీగా ఉండే సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కునేది నిజమే. దేశం కోసం కొన్ని త్యాగాలు - కష్టాలు చేయకతప్పదు. నిజానికి సామాన్య ప్రజానీకం దేశం కోసం త్యాగాలు చేయడానికి, కష్టాలు పడటానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటారుస అని ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు ప్రకటన చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రకటన అనంతరం ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ ' ఈ నిర్ణయం దేశ భవిష్యత్ ను మార్చివేస్తుంది. ఆర్థికరంగంపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. నిజాయితీగా జీవించే ప్రజానీకం అంతా ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పరులు మాత్రమే పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తప్పు పడుతున్నారు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను బయటపెట్టిన ప్రతిపక్షాలు బీజేపీ రెండు నాల్కల దోరణికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/