మోడీ ఏపీ టూర్ రద్దు...అదే కారణం

Update: 2019-02-28 07:03 GMT
బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యే ప‌రిణామం ఇది. ప్రధాని నరేంద్రమోడీ విశాఖ టూర్ రద్దయింద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. పీఎంవో వర్గాలు ఈ విష‌యాన్ని అన‌ధికారికంగా పేర్కొంటున్నాయి.  అయితే రద్దు విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ సైనం అదుపులోకి తీసుకోవటంతో దేశమంతా శోకసంద్రలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అభినందన్ ను సురక్షితంగా వెనక్కి రప్పించే వరకు మోడీ రాజకీయాలను పక్కకు బెట్టాలని ఆయా పార్టీల నేత‌లు కోరుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటి బాధకరమైన సమయంలో రాజకీయాలకు తావులేకుండా చేయాలని కోరారు. మన పైలట్ ను పాక్ బందించటం  చాలా బాధకరమని ఆయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరోవైపు ఇండియా- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దేశమంతా తీవ్ర టెన్షన్ లో ఉంది. మన పైలట్ అభినందన్ ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. భారతీయులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నాయి. ఇలా యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్న నేపథ్యంలో రేపు జరగాల్సిన మోడీ విశాఖ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు. విశాఖ పర్యటన రద్దు అయ్యే అవకాశాలున్నందునే మోడీ స్వయంగా విశాఖ సభలో ప్రకటించాలని భావించిన విశాఖ రైల్వే జోన్ ప్రకటనను రైల్వే మంత్రి పియూష్ గోయెల్ హడావుడిగా ప్రకటించార‌ని స‌మాచారం.

కాగా, ఇప్ప‌టికే ప్రధాని మోడీ ప్రారంభోత్సవాల్లో పాల్గొనటం - యాప్ లు లాంచ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రధానిపై ఫైర్ అవుతున్నారు. ప్రధానికి ఇలాంటి సమయంలో ఇవి అవసరమా.. అని ప్రశ్నిస్తున్నారు. తమకు కావాల్సింది ఈ యాప్ లు కాదు.. పాక్ అదుపులో ఉన్న పైలట్ ను క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు. దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని ప్రారంభోత్సవాల్లో పాల్గొనటం సిగ్గుచేటు అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రధాని ఇవాళ ఢిల్లీలో ఖేలో ఇండియా యాప్ తో పాటు  నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ని ప్రారంభించారు. దీనిపై నెటిజన్లు ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. మరి కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
Tags:    

Similar News