మోడీని చూసి భయపడుతున్న కెవాడియా కాలనీ వాసులు!!

Update: 2019-10-31 08:38 GMT
ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజు నుండి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే డెమానిటైజేషన్  - gst వంటి నిర్ణయాలతో తన అభిమతం ఏమిటో చాటిచెప్పారు. ముఖ్యంగా డిమానిటైజేషన్ తో ఇప్పటికి కూడా ప్రజలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తాజాగా బంగారం పై కూడా సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక దేశ ప్రధానిగా పలు కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న మోడీని చూసి ప్రస్తుతం దేశ ప్రజలు గర్విస్తుంటే ..ఒక కాలనీ వాసులు మాత్రం మోడీని చూసి భయపడుతున్నారు. అసలు ప్రధాని మోడీ ని చూసి ఒక కాలనీ ప్రజలు భయపడటం దేనికి అనుకుంటున్నారా ..దానికి ఒక కారణం ఉంది. ఎవరి భయం వారిది అన్నట్టు .. మోడీని చూస్తేనే వారు హడలిపోతున్నారు.

పటేల్ జయంతి సందర్భంగా ఈరోజు (అక్టోబరు 31)న ప్రధాని నరేంద్ర మోదీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కెవాడియా కాలనీకి వచ్చారు.  కెవాడియా కాలనీలో - చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధాని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కెవాడియా కాలనీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం కెవాడియా కాలనీకి  ప్రత్యేక హోదా కల్పించబోతుంది అనే వార్త అక్కడివారికి నిద్రలేకుండా చేస్తుంది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే వారు ఎక్కడ కావాలంటే అక్కడ భూములను సులభంగా సేకరించగలుగుతారు. ఇప్పటికే మేము చాలా కోల్పోయాం అంటూ తెలిపారు.

మా భూములు ఇప్పటికే తీసుకున్నారు.. ఉపాధి లేకుండా చేశారు.. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయాలనుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన కంపెనీలకు మా భూములు అప్పగించారు. భవనాలు నిర్మిస్తున్నారు.. కానీ ఇక్కడి గిరిజనులకు కలిగే ప్రయోజనమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ - కెవాడియాను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే యోచనేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది. కాగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం తరువాత అక్కడ పర్యటకాభివృద్ధి పెరగడంతో కెవాడియా గ్రామపంచాయతీ అక్కడి నిర్వహణ చూసుకోలేకపోతోందని.. కాబట్టి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాన్ని కెవాడియా గ్రామపంచాయతీ నుంచి మినహాయించి ప్రత్యేక జోన్‌ గా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని జేఎన్ సింగ్ సమాచారం. 
Tags:    

Similar News