తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని నరేంద్రమోడీ తనదైన శైలి పంచ్ లు వేశారు. ఈరోజు ప్రధాని తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందేగా. తెలంగాణలో పాలమూరులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రికి యాగాలు చేయడానికి టైం సరిపోతుంది. పాలన ఎపుడు చేస్తాడు అన్నారు. మేలో ఎన్నికలకు పోతే నువ్వు పోతావు అని చెప్పారట జ్యోతిష్కులు, అంతే ముందస్తుకు పోయాడు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న సీఎం నడపాలా? జ‌్యోతిష్కులు నడపాలా? ఆలోచించండి అంటూ మోడీ పిలుపునిచ్చారు. మోడీ జాతకం బాగుంది, ఆయన దాటికి మీరు తట్టుకోలేరు. దయచేసి ముందస్తు ఎన్నికలకు పొమ్మని జ్యోతిష్కులు చెప్పారట, కేసీఆర్ విన్నారట.? అంటూ మోడీ సెటైర్లు వేశారు.
మేలో ఎన్నికలు పెడితే టీఆర్ ఎస్ పార్టీ పటాపంచలు అవుతుందట. ఏమి నమ్మకాలివి. జ్యోతిష్కులు రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా అని మోడీ ప్రశ్నించారు. జ్యోతిష్కుల వల్ల కేసీఆర్ విధానాల వల్ల దేశ ఖజానాకు ఎంత నష్టమో తెలుసా? లోక్ సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తే ఇదే ఖర్చులో రెండూ అయిపోయేవి... ఇలాంటి దుబారా ముఖ్యమంత్రి కావాలా మనకు? ఆయన పిచ్చి ఇక్కడితో అయిపోలేదు... మంత్రివర్గం కూడా 3 నెలలు లేటు. ప్రజలకు అనుగుణంగా రాష్ట్రం ఉండకపోయినా పర్లేదు కేసీఆర్ కు అనుగుణంగా ఉంటే చాలట...ఇదేమైనా ప్రజాస్వామ్యమా? కంపెనీయా అంటూ మోడీ విరుచుకుపడ్డారు. ప్రజలు బాగుపడాలని కొత్త రాష్ట్రం ఇస్తే... తండ్రీకొడుకులు, కూతురు, అల్లుడు బాగుపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు లేదు, వెలుగు లేదు అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తప్పు చేయకండి. మేల్కొండి. దృఢమైన ప్రభుత్వాన్ని కలిసి నిర్మిద్దాం. కేంద్రంలో అయినా కుటంబ పాలన రాకుండా చూద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.