తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మథించి తెలంగాణ రైతులపై వదిలిన గొప్ప పథకం ‘రైతుబంధు’. ఇది తెలంగాణలో గ్రాండ్ హిట్టయ్యింది. టీఆర్ఎస్ కు ఓట్ల వాన కురిపించి మరోసారి అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక రైతుబంధును ఎన్నికలకు వెళ్లే ముందు కాపీ కొట్టిన మోడీ ‘పీఎం కిసాన్’ పేరుతో అమలు చేసి ఆయన కూడా అధికారంలోకి వచ్చారు. రైతుల దశను మార్చే ఈ పథకాలు కేసీఆర్ మానసపుత్రికలుగా ఉన్నాయి.
అయితే కేసీఆర్ రైతుబంధును కాపీ కొట్టిన మోడీ ఇప్పుడు మరో కేసీఆర్ పథకాన్ని కూడా తన బడ్జెట్ లో ప్రతిపాదించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టేలా కేంద్రం మరో పథకాన్ని ప్రకటించింది.
హర్ ఘర్ జల్ పేరుతో కేంద్రం ప్రకటించిన ఈ పథకంలో దేశంలోని ప్రతీ ఇంటికి 2024 వరకు మంచినీళ్లు అందించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా బడ్జెట్ లో ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికి మంచినీరును అందిస్తామన్నారు.
ఇలా రైతు బంధు తరహాలోనే ఇప్పుడు మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టడం విశేషం. మరీ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ టీం ఈ క్రెడెట్ ను తమదే అని చెప్పుకునే సమయం వచ్చింది. గులాబీ శ్రేణులు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి మరీ..