హిల్లరీ, ట్రంప్ లపై మోడీ గెలుపు

Update: 2016-11-09 02:25 GMT
అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తుందా... ట్రంప్ గెలుస్తారా అని అమెరికా సహా ప్రపంచమంతా ఆలోచిస్తున్న సమయంలో భారత ప్రధాని మోడీ సడెన్ స్టార్ లో ఎంటరై వారిద్దరిపైనా విజయం సాధించారు. అవును... ప్రపంచం దృష్టినాకర్షించడంలో మోడీ వారిద్దరినీ పక్కకు నెట్టి మరీ ఫస్టు ప్లేసు కొట్టేశారు. ప్రపంచమంతా అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతోందో అని చూస్తోంది.. మీడియా అయితే.. ఎవరు గెలిస్తే ఏంటి అని కథనాలు రెడీ చేసక్కూచుంది. కానీ... ఎవరూ ఊహించనట్లుగా మోడీ 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా సీను మారిపోయింది. ప్రధాని ప్రసంగానికి ముందు వరకు గంటలు గంటలు అమెరికా కథనాలే వేసిన టీవీల్లో అమెరికా సమాచారం స్క్రోలింగులకు పరిమితం అయిపోయింది.. పత్రికల్లో అయితే, నిన్నమొన్నటి వరకు రెండేసి, మూడేసి పేజీలు వేసిన పత్రికలు మోడీ దెబ్బకు అమెరికా ఎన్నికలు 'సింగిల్ కాలమ్" అనేశాయి.

ఇక ఆన్ లైన్ ప్రపంచంలోకి వచ్చి చూస్తే... ఎటు చూసినా మోడీ మాటే. సోషల్ మీడియా అయితే మోడీ నిర్ణయన్ని తెగ పొగిడింది. ఆయన అలా ప్రకటించారో లేదో ఇలా సోషల్ మీడియా యాక్టివేట్ అయిపోయింది. ఇకపై 500, 1000 నోట్లు ఎందుకూ పనికిరానివంటూ రకరకాల చిత్రాలు పెట్టారు. జోకులు, సెటైర్లు ఒకటేమిటి.

మరోవైపు గూగుల్ సెర్చిలోనూ అమెరికా ఎన్నికలు, ట్రంప్, హిల్లరీ వంటి పదాలన్నీ వెనక్కు పోయాయి. మోడీ తీసుకున్న నిర్ణయమే టాప్ లోకి వచ్చేసింది. గూగుల్‌లో అమెరికా ఊసే లేదు

ప్రధాని తీసుకొన్న నిర్ణయంతో గూగుల్‌ ట్రెండ్స్‌లో అమెరికా ఎన్నికల అంశం జాడే లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా న్యూస్‌, మోదీ, 2000 ఆర్‌ఎస్‌ నోట్‌, 500 ఆర్‌ఎస్‌ నోట్‌, 2000 రూపీస్‌ నోట్‌ ఇండియా, ఇండియా కరెన్సీ, పీఎం మోదీ స్పీచ్‌, మోదీ స్పీచ్‌ లైవ్‌, బ్యాంక్‌నోట్‌ వంటి పేర్లతో విపరీతమైన సెర్చ్‌ జరుగుతోంది. మోదీ ప్రసంగ ప్రారంభంలో 5-10 శాతం ఉన్న ఆసక్తి క్షణాల్లోనే 100 శాతంగా మారిపోయింది. ఇలా... మోడీ.. హిల్లరీ, ట్రంప్ లను వెనక్కు నెట్టి ఫస్టు ప్లేసు కొట్టేశారు.
Tags:    

Similar News