జర్ననీ పర్యటనలో పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు మోడీ వరాల జల్లులు కురిపిస్తున్నారు. మీకెందుకు ముందు మీరు రండి.. తర్వాత నేను చూసుకుంటాను అనే స్థాయిలో వారికి భరోసా ఇస్తున్నారు. గతం సంగతి పక్కన పెట్టండి, టెరంస్ అండ్ కండిషన్స్ అన్నీ నేను మారుస్థాను కథా అంటూ పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షించేపనికి పూనుకున్నారు మోడీ. ఈ క్రమంలో భారత్ లో భారత్లో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక వేత్తలకున్న వెసులుబాట్లను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ.. జర్మనీ దినపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జెమెయిన్ జీటంగ్ లో ఎడిటోరియల్ పేజీలో ఒక వ్యాసం రాశారు.
ఈ వ్యాసంలో మోడీ పెట్టుబడిదారులను ఆకర్శించడానికి, రెడ్ కార్పెట్ పరచామని చెబుతూ... అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక వర్ధమాన దేశంగా భారత్ ఉందని మోడీ ఆ వ్యాసంలో వివరించారు. ఈ సందర్భంలో ‘రహే సాథ్ - బఢే సాథ్’ (కలిసి ఉండాలి - కలిసి ఎదగాలి) నినాదంతో ఇరుదేశాలూ కలిసి అభివృద్ది చెందాలని, అన్ని రంగాల్లోనూఉ వృద్ధి సాధించాలని మోడీ తెలిపారు. ఇది కేవలం రాజకీయ ఎజెండాగా మిగిలిపోకుండా, పూర్తిస్థాయిలో తమ లక్ష్యంగా చూస్తామని ఆయన ప్రకటించారు. జర్మనీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఏమేం చర్యలు తీసుకోవచ్చో మీరు చెప్పినా సహృదయంతో స్వీకరించడానికి భారత్ సిధంగా ఉందని మోడీ పునరుద్ఘాటించారు. మోడీ జర్మనీ పర్యటన - ఫలితం అనేది త్వరలోనే తేలనుంది. ఈ విషయంపై జర్మనీ పారిశ్రామిక వేత్తలు ఎలా స్పందిస్తారు... టెరంస్ అండ్ కండిషన్స్ లో ఎటువంటి మార్పులు తీసుకువస్తారు అనే విషయు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది!