పాదయాత్ర తర్వాత వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిలో చాలా మార్పు వచ్చింది. ప్రతీ అంశాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఆవేశపడకుండా.. చాలా బ్యాలన్స్ డ్ మాడ్లాడుతున్నారు. అదే సమయంలో.. అధికార పక్షానికి అదిరిపోయే కౌంటర్లు కూడా ఇస్తున్నారు. పాదయాత్ర తర్వాత ఏపీలో జగన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రజలే కాదు.. ఇతర పార్టీలకు చెందిన సీనియర్ లీడర్లు, జాతీయస్థాయి నాయకులు కూడా జగన్ ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ప్రధాని మోదీ కూడా చేరారు. ట్విట్టర్ లో జగన్ కు ఫాలోయర్ గా మారారు మోదీ. రెండు రోజుల క్రితమే ట్విట్టర్ లో జగన్ కి ఫాలోయర్ గా మారారు మోదీ. అంటే జగన్ పెట్టే ప్రతీ కామెంట్ ఇప్పుడు మోదీ కూడా చూడొచ్చన్నమాట.
ఏపీలో త్వరలో ఏన్నికలు. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి పోటీపోటీగా ప్రచారం మొదలుపెట్టేశాయి. బీజేపీకి ఏపీలో పెద్దగా సీన్ లేకపోయినా.. ఏపీ రాజకీయాలపై మాత్రం ఓ కన్ను వేసే ఉంచింది. అందుకే.. ఏపీలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్రమంలో వైసీపీ అధినేత జగన్ ని ఫాలో అవుతున్నారు మోదీ. దీనివల్ల.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎలాఉంది, వారి కౌంటర్స్ ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ మాత్రం దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంది. బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం జరిగింది అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదని అంటోంది.