తెలుగురాష్ట్ర ప్రజలకు అత్యంత పరిచయం ఉన్న రాజకీయనాయకుల్లో కొనిజేటి రోశయ్య ఒకటి. అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా - ఫైనాన్స్ మినిస్టర్ గా తెలుగురాష్ట్రాల్లో సేవలందించిన రోశయ్య... ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా రోశయ్య మోడీకి ఒక ప్రత్యేక ఆహ్వానం పంపారు. అది రాజకీయపరమైన ఆహ్వానం కాదండోయ్.. ఒక రాష్ట్ర గవర్నర్ - దేశ ప్రధానిని తన కుటుంబంలో జరగబోయే వివాహానికి ముఖ్య అతిధిగా పిలవడానికి.
త్వరలో చెన్నైలో జరగనున్న రోశయ్య మనవడిపెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం వెళ్లింది. మోడీకి వివాహ ఆహ్వాన పత్రికతో పాటు ప్రత్యేక డ్రై ఫ్రూట్స్ ని కూడా పంపారు రోశయ్య. ఇదే క్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఇంకా మరికొంతమంది కేంద్రమంత్రులకు కూడా రోశయ్య ఆహ్వానాలు పంపారు.
త్వరలో జరగబోయే ఈ భారీ వివాహా కార్యక్రమానికి భారీ సంఖ్యలో వీఐపీలు రానున్నారని సమాచారం. సినీ ప్రముఖులూ - రాజకీయ నాయకులు - క్రీడాకారులు - అమెరికానుంచి దౌత్య ప్రతినిధులు ఇలా సుమారు 200కు పైగా జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు అతిధులుగా రానున్నారట!