మోడీకి గిఫ్ట్ గా చంద్రబాబు గుర్తు

Update: 2017-06-28 08:36 GMT
మూడు దేశాల పర్యటనకు వెళ్లొచ్చిన మోడీ అక్కడి నుంచి మన దేశానికి ఎంతో మర్యాద మన్ననలు, గౌరవం, ప్రయోజనాలు తీసుకొచ్చారు. పోర్చుగల్ - అమెరికా - నెదర్లాండ్స్ లలో పర్యటించిన ఆయన ఈ రోజు ఉదయం తిరిగి ఇండియాకు వచ్చేశారు. వస్తూవస్తూ తనతో పాటు నెదర్లాండ్స్ నుంచి ఒక స్పెష‌ల్‌ బహుమతిని తెచ్చుకున్నారు. అది అక్కడి ప్రధాని మార్క్ రూటీ ఇచ్చారు. ఇంతకీ ఆ బహుమతి ఏంటో తెలుసా... సాధారణ సైకిల్.  కానీ, దాన్ని బహూకరించడంలో ఎంతో సందేశం - స్ఫూర్తి ఉండడంతో మోడీ దాన్ని తనతో పాటు భారత్ కు తెచ్చారు. అంతేకాదు... డచ్ ప్రధాని నుంచి ఆ బహుమతిని స్వీకరించిన సమయంలో కూడా ఆయన దానిపై కూర్చుని తొక్కారు.
    
పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేసే దేశాల్లో నెదర్లాండ్స్ ది అగ్రస్థానం.  అక్కడ చాలావరకు విద్యుత్ తో నడిచే వాహనాలే ఉంటాయి. స్థానికంగా సైకిళ్లపై తిరుగుతూ కాలుష్యాన్ని తగ్గిస్తారు. మన దేశం కూడా కాలుష్య నివారణకు కంకణం కట్టుకుని పారిస్  ఒప్పందంలో కీలకంగా వ్యవహరించింది. అందుకే మోడీకి ఇచ్చిన ఆ కానుక అంత ప్రాధాన్యం సంతరించుకుంది.
    
కాగా మోడీ పోర్చుగల్ - అమెరికా - నెదర్లాండ్స్ దేశాలను 95 గంటల టూర్ లో చుట్టి వచ్చారు. ఈ 95 గంటల్లో నాలుగు రాత్రులుండగా, వాటిల్లో రెండు రాత్రులు విమానంలోనే ఉండిపోయిన మోడీ, మొత్తం మీద 33 గంటల పాటు 'ఎయిరోప్లేన్ మోడ్'లో గడిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలోనే ఆయన పర్యటనంతా సాగింది. పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో ఆయన రాత్రిపూట ఉండలేదు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ కు ప్రయాణించే వేళ ఓ రాత్రిని విమానంలో గడిపిన ఆయన, అదే రోజు వాషింగ్టన్ కు పయనమయ్యారు. ఆపై అక్కడ మరో రోజు ఉండి, అక్కడి నుంచి హేగ్ కు వెళ్లి, ఆపై అదే రోజు విమానంలో మరో రాత్రిని గడిపి ఇండియాకు వచ్చేశారు. మోదీ, ఆయనతో పాటు వెళ్లిన 50 మంది భారత బృందం వాషింగ్టన్ లోని విల్లార్డ్ కాంటినెంటల్ హోటల్ లో మాత్రమే బస చేసింది. మిగతా అంతా లిస్బన్ ఎయిర్ పోర్టు వీవీఐపీ లాంజ్, దేశాధినేతల కార్యాలయాలే మోడీకి ఆతిథ్యమిచ్చాయి. ఈ పర్యటనలో భాగంగా మోదీ పోర్చుగల్ లో 5, అమెరికాలో 17, నెద‌ర్లాండ్స్ లో 7 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News