ఒక్కో వంటకాన్ని ఒక్కో రకంగా చేస్తేనే దాని రుచి పెరుగుతుంది. వడ అందరూ చేస్తారు. కానీ.. ముట్టుకున్నంతనే కాస్తంత రోస్టు ప్రై అన్నట్లుగా ఉంటూ.. బంగారు వర్ణంలో.. ఎక్కువ నూనె లాగకుండా.. మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ ఎక్కువ ఫ్రై కాకుండా వేగిస్తే.. దాని రుచే వేరు ఉంటుంది. ఇలా ఒక్కో వంటకానికి ఒక్కో రకమైన జాగ్రత్త తీసుకుంటే.. దాని రుచి రెట్టింపు అవుతుంది. ఇలా ఏ వంటకానికి దేన్ని యాడ్ చేయాలన్న విషయం బాగా తెలిసిన వారే మంచి వంట చేశారన్న టైటిల్ సొంతం చేసుకుంటారు. అలానే.. రాజకీయాల్లోనూ ఏ సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఏ అంశాల్ని ఎప్పుడు ప్రస్తావించాలన్నది చాలా ముఖ్యం.
రాజకీయాల్లో టైమింగ్ తోనే చాలానే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు ఏ విషయాన్ని ప్రస్తావిస్తే.. ప్రజలు ఇట్టే కనెక్టు అయిపోతారన్న విషయంపై క్లారిటీ చాలా అవసరం. ఇలాంటి విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మోడీ అండ్ కో మొదటి లక్ష్యమంతా యూపీనే. యూపీలో గతంతో పోలిస్తే పది అసెంబ్లీ స్థానాలు తగ్గినప్పటికీ.. గెలుపు పక్కా చేసుకుంటే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో గెలుపు లెక్కలు తేడా కొట్టినా పెద్దగా తేడా రాదు.
తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే దేశ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయన్నది వాస్తవం. ప్రజల్లో మోడీగ్రాఫ్ ఎలా ఉందన్న దానికి లిట్మస్ టెస్టుగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయని అంటున్నారు. ఈ విషయం మోడీకి తెలియంది కాదు. అందుకే ఆయన.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అవసరానికి తగ్గట్లుగా సెంటిమెంట్ ను పండిస్తున్నారు.
కాకపోతే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు సెంటిమెంట్ డోస్ ను తన మాటల్లో ఎక్కువగా దట్టిస్తున్నారన్న భావన కలుగక మానదు. తాజాగా ఆయన మాట్లాడిన సందర్భంగా.. యూపీలోని తన ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్ వాదీపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ను ఉద్దేశిస్తూ ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు తన చావును కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
తన చావు వారణాసిలో సంభవించాలని భావిస్తున్నారని ఆరోపించారు. అయితే.. తన ప్రాణం పోయే వరకు వారణాసి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం లభిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్న మోడీ మాటలు చూస్తే.. ఆయన తన నియోజకవర్గాన్ని ఎంతలా ప్రేమిస్తున్నారన్న భావనను తెలియజేసేలా చేశారని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు కీలకమైన ఎన్నికల సమయంలో మోడీ నోటి నుంచి వస్తే.. ఓటు బ్యాంక్ మరింత బలోపేతం అవుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయినా.. రాజకీయ వంటలో ఎప్పుడేం దినుసులు వేస్తే.. అదిరే వంటకం తయారవుతుందో మోడీకి తెలిసినంత బాగా మరెవరికైనా తెలుసంటారా .. ఇప్పటి పరిస్థితుల్లో?